Ice Apple Payasam:వేసవిలో దొరికే మామిడి పండ్లతో మామిడి తాండ్ర, మ్యాంగో జ్యూస్ ఇలా నాచురల్ గా తింటాం కదా. అలాగే ముంజులు ,మామిడి పండ్లు ఇవన్నీటితోనే మనo ఎండలో కూల్ కూల్ గా ఆ నెల అంతా గడిపేస్తాం.
వీటితోనే మనం డిఫరెంట్ రెసిపీస్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే తాటి మంజులు డైరెక్ట్ గా తిన్న, షుగర్ వేసుకుని తిన్న చాలా బాగుంటాయి. ఇంకా టేస్ట్ గా ఉండడానికి ఈ రెసిపీని కూడా మీరు ట్రై చేయండి. ఇది సమ్మర్ లో జరిగే పార్టీలో వెల్కమ్ డ్రింక్ గా కూడా ఆఫర్ చేయొచ్చు.
కావలసినవి:
750 ml milk, ఐదారు స్పూన్లు పంచదార, టేస్ట్ కి చిటికెడు ఇలాచి పౌడర్, గార్నిష్ కి బాదం డ్రై ఫ్రూట్ flakes.
చేయు విధానం:
ముందుగా కడాయిలో 750 ml పాలని పోసి బాయిల్ చేసుకోవాలి. గరిటతో కలుపుకుంటూ పొంగు వచ్చి చిక్కపడే వరకు అడుగు అంటకుండా గరిట తీసుకొని చక్కగా కలుపుకుంటూ ఉండాలి. వన్ థర్డ్ కప్ అంటే ఐదు స్పూన్లు పంచదార వేసి ఇంకొంచెం మరిగించుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసి పాలను కాసేపు చల్లారనివ్వాలి .పాలు చల్లారే లోపు ఒక 6 ముంజలు తీసుకోండి లేతగా ఉన్నవి చూసి తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, కట్ చేస్తున్న ముక్కలు, నీరుతో సహా చల్లారిన పాలల్లో వేసి కలపాలి.
రెండు మూడు ఇలాచి దంచి పౌడర్ కింద వేసుకోవాలి, బాదం కూడా కట్ చేసి సన్నగా sprinkle చేసుకొని నాలుగు ఐదు గంటలు ఫ్రిజ్లో పెట్టుకోవాలి.