Instant Biryani Gravy:బిజీ డేలో శ్రమ లేకుండా అప్పటికప్పుడు10ని||ల్లో అయిపోయే బిర్యానీ గ్రేవీ

బిర్యానీ ,ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ ఏమన్నా చేసుకున్నప్పుడు రైతా చేసుకుంటాము. అందులో  గ్రేవీని ఇలా తయారు చేసుకుంటే త్వరగా అయిపోతుంది . టైం లేనప్పుడు, regular గా చేసుకున్నప్పుడు ఈ ప్రాసెస్ చాలా ఈజీగా బాగుంటుంది. 

చేసే విధానం:

ఒక మిక్సీ జార్ తీసుకొని ,పావు కప్పు ఎండు కొబ్బరి , ఇంచ్ దాల్చిన  చెక్క, 4 యాలకులు, రెండు లవంగాలు, రెండు స్పూన్ల ధనియాలు, రెండు స్పూన్ల గసగసాలు, గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఒక ఇంచ్ అల్లం, ఏడు వెల్లులి రేఖలు, రెండు టమాటాలు ముక్కలు,  రెండు స్పూన్లు కొత్తిమీర, రెండు స్పూన్లు పుదీనా, ఒక్క స్పూన్ కారం ,పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మళ్లీ గ్రైండ్ చేయండి . 

కొంచెం వాటర్ వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్ గా ఉండాలి .మరొక పక్క ఒక బాండీ తీసుకొని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ షాజీరా, ఒక ఇంచు దాల్చిన చెక్క, రెండు యాలకులు, రెండు లవంగాలు, బిర్యానీ ఆకు ఒకటి, కొంచెం కరేపాకు వేసుకోండి. ఇవి వేపిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా అందులోను వేసేయండి.

low ఫ్లేమ్ లోనే ఉంచి మసాలాని బాగా ఫ్రై చేయాలి. కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా చూసుకోండి. ఇలా నూనె సెపరేట్ అవుతూ ఉన్నప్పుడు, ఒక కప్పు నీళ్లు పోసుకుని కొంచెం జారుగా చేసుకోండి. దాంట్లో ఒక స్పూన్ కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చు. 

కాసేపు మూత పెట్టి ఉడకనివ్వండి. ఒక 5-10 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. అంతేనండి బిర్యాని, ఫ్రైడ్ రైస్,  చపాతి, రోటి ఎందులో అయినా ఇది చాలా టేస్టీగా ఉంటుంది.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top