Jonna Pittu:ఎదిగేపిల్లలతోపాటు పెద్దవాళ్ళుకూడా తప్పకతినాల్సిన అమ్మమ్మలకాలంనాటి వంటకం

 

ప్రస్తుతం పిల్లలు జంక్ ఫుడ్స్ కి ఎక్కువ అలవాటు పడిపోయారు. మన  సంప్రదాయకరమైన వంటల్ని, ఆరోగ్యపరమైన వంటల్ని చేయటానికి కూడా కష్టంగా ఉంది. వాళ్ళు ఇష్టపడే వంటలకే  మక్కువ చూపించడంతో ఇవన్నీ మనకి హ్యాంగ్ అయిపోతున్నాయి. ఈరోజు జొన్న పిట్టు ,ఇది అమ్మమ్మ నాటి కాలం నుండి చాలా హెల్దీగా చేసుకునే రెసిపీ. ఇది చూడండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. 

కావలసినవి:

జొన్నలు, బెల్లం ,ఎండుకొబ్బరి, ఇలాచీ పౌడర్ ,నెయ్యి.

చేసే విధానం:

రెండు కప్పుల జొన్నలు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక నైట్ అంతా నానపెట్టేసుకోండి. తెల్లారికి బాగా నానిపోయి ఉంటాయి. ఒక జాలి గిన్నె తీసుకొని మొత్తం వాటర్ అంతా drain చేసుకోండి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని వీటిని దానిమీద ఆరబెట్టుకోండి. అరిసెలకి బియ్యం ఎలా తడి మీద ఆరపెట్టి ఆడించుకుంటామో అలాగా  బాగా డ్రై అవ్వకుండా కొంచెం తేమగా ఉన్నప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ వేసుకోండి. 

రెండు pulse ఇచ్చుకుంటూ తిప్పితే అది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా చూసుకోండి. ఒక వెడల్పాటి పళ్ళెంలో ఈ పిండిని తీసుకోండి.  మనం  చేతిలోకి తీసుకొని ఇలా వేళ్ళతో ముడుచుకుంటే , ముద్దలాగా రావాలి .అది కరెక్ట్  consistency. లైట్ గా ఉప్పు వేసి పిండి అంతా కలపెట్టుకొని,  చేతితో ఒక ముద్ద అవుతుందో లేదో చెక్ చేసుకోండి.  

లేదంటే  లైట్ గా కాస్త వాటర్ స్ప్రింకుల్ చేసుకోండి. ఈ పిండినంతటిని ఒక కాటన్  క్లాత్ తీసుకొని దాంట్లో వేసి  పిండిని బాగా అధిమి వేసి అంటే దగ్గరగా నొక్కి పెట్టి, ఒక spoon తోటి నాలుగు హోల్స్ లాగా  పెట్టి, నాలువైపులా cloth ని, పిండి మీద కవర్ చేసేసుకోండి. కవర్ చేసిన ఈ పిండి క్లాత్ ని జల్లిబుట్ట ఉంది కదా దాంట్లో పెట్టుకొని ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో ఒక లీటర్ వరకు నీళ్లు పోసి ఈ గిన్నెని ఆ మందపాటి గిన్నెలో వేసి మూత పెట్టేయండి. 

అంటే ఆవిరి మీద ఉడుకుతున్నట్టుగా, కింద నీళ్లు పోసి మనం ఇడ్లీ ఎలా పెడుతున్నామో అలాగా నీళ్లు పోసి పైన ఈ జల్లి గిన్నె లో పిండి పెట్టి, మూత పెట్టాలి. అంటే ఆవిరి మీద  20 నిమిషాల పాటు మగ్గబెడుతున్నాం. ఒక్కసారి మూత తీసుకొని  పిండి అంతా మగ్గింది లేనిది తెలుస్తుంది. మీరు చేత్తో పట్టుకున్న తెలుస్తది లేదా  నోట్లో వేసుకున్న కమ్మదనం వల్ల తెలుస్తుంది. 

ఉడికింది లేనిది తెలుస్తుంది .ఇది ఆవిరి బయటికి పోకుండా మూత ఉండేలా చూసుకోండి .తర్వాత ఎండు కొబ్బరి కచ్చాపచ్చాగా ఒక మిక్సీలో వేసుకున్నా సరే ,రోటిలో వేసుకున్న సరే దంచి పొడి చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒక పళ్లెం తీసుకుని ఒక కప్పు లేదా ఒకటిన్నర స్వీట్ ఎక్కువగా తినేవాళ్లు ,బెల్లం తురుము వేసుకొని దానిమీద  ఉడకబెట్టిన జొన్న పిండిని వేసేసుకోండి. 

దానిమీద దంచి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి కొంచెం ఇలాచి పౌడర్ వెయ్యండి. పిండి వేడికి బెల్లం తురుము కలుస్తుంది కాబట్టి పిండిని చక్కగా బెల్లం తురుము మీద అద్ది పెట్టి పైన పౌడర్ వేసి ఒక నిమిషం చల్లారే వరకు ఉంచండి . చేయి పెట్టగలిగినంత వేడి చూసి మొత్తం మూడు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి . 

ఇప్పుడు కొంచెం నాలుగైదు స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలపండి. వీటిని లడ్డూల చుట్టి పిల్లలకు ఇస్తే తింటారు లేదా ఒక కప్పులో వేసి ఒక స్పూన్ వేసిన, ఇష్టంగా తింటారు. ఏదేమైనా వాళ్ళు తినటం కావాలి కాబట్టి ఇది చాలా హెల్దీ ఫుడ్ కాబట్టి వాళ్లకి ఏదో రకంగా తినిపించేలా ట్రై చేయండి.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top