Pesara Pappu Charu:ఎండాకాలంలో ఒంటికి చలువచేసే కమ్మని పెసరపప్పు చారు సులభంగా ఇలాచేసెయ్యండి

పెసరపప్పుతో ఏం చేసుకున్నా.. ఎండాకాలం చలవ ఆవకాయలు తింటాము దానితోపాటు ఇలాంటి పెసరకట్టు చారు చేసుకుంటే బాలన్స్ అవుతుంది. పిల్లలు కూడా liquids ఇష్టంగా తింటారు. 

కావలసినవి:

పెసరపప్పు ,ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి ,పోపు సామాన్లు -  కరివేపాకు ,వెల్లుల్లి ,ఆవాలు, జీలకర్ర, మెంతులు, నిమ్మరసం, ఉప్పు ,కారం.

చేయు విధానం:

అరకప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లో రెండు కప్పుల నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ లో మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోండి. అందులో కొంచెం పసుపు కూడా వేసుకోండి .అవి ఉడికేలోపు ఒక బాండీలో రెండు స్పూన్లు నెయ్యి వేసి పోపులాగా  కొంచెం మెంతులు, అర స్పూన్ ఆవాలు ,అర స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండు మిరపకాయలు వేసి వేయించుకోవాలి .


అందులోనే ఒక నాలుగు పచ్చి మిరపకాయలు చీలికలు చేసి వేసుకోండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ పొడుగ్గా ముక్కలు కట్ చేసుకుని వేపుకోండి .నాలుగైదు వెల్లులి రేఖలు కొద్దిగా ,కరివేపాకు కొంచెం ,ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని, ఉల్లిపాయలు కలర్ మారేవరకు వేపుకోవాలి. అందులో రెండు మీడియం సైజ్ టమోటాలు ముక్కలు  వేసుకొని మూత పెట్టి, కొంచెం మగ్గనివ్వండి .

అంతలో  పెసరపప్పు మూత తీసి smash చేసి ,  ఉల్లిపాయలు టమాటాలు మగ్గాక  దాంట్లో వేసుకోండి .అలాగే ఒక మూడు కప్పులు వాటర్ దగ్గర పెట్టుకొని ఆ కన్సిస్టెన్సీ ని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటూ కలపండి . 

చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువగా పోసుకోండి .ఇందులో కొద్దిగా ఉప్పు చివరిలో నిమ్మరసం కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది .సరిపడా చిక్కదనం చూసుకొని ఆఫ్ చేసేయండి అంతే ఈ పెసరపప్పు చారు చాలా రుచిగా ఉంటుంది. ఒంటికి చలవ కూడా చేస్తుంది.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top