Dosakaya Pachadi:పల్లెటూరి స్టైల్ లో దోసకాయ రోటి పచ్చడి ఇలా చేసిచూడండి రుచి అదిరిపోతుంది

రోటి పచ్చడి అంటేనే నోరూరిపోతుంది. అందులో దోసకాయ పచ్చడి ఇంకా చెప్పనవసరం లేదు. ఏ పచ్చడి అయినా రోట్లో మనం దంచినప్పుడు ఆ taste డిఫరెంట్ గా ఉంటుంది. నోరూరించేలా ఉంటుంది. 

కావలసినవి:

మీడియం సైజు ఒక దోసకాయ, రెండు టమాటాలు ,ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ,ధనియాలు, మినప గుళ్ళు ,పచ్చిశనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ,చింతపండు.

చేసే విధానం:

ఒక పాన్ తీసుకొని దాంట్లో రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసి ఒక స్పూన్ ధనియాలు, రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు, రెండు టీ స్పూన్ల మినప గుళ్ళు ,ఒక టీ స్పూన్ జీలకర్ర ,లో ఫ్లేమ్ లో ఈ దినుసులన్నీ వేగించుకొని ఎర్రగా  కాకుండా కొంచెం దోరగా వచ్చాక వాటిని తీసి పక్కన పెట్టుకోండి. 

ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి కూడా తీసి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. మళ్లీ ఆ పాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దోసకాయ ఒక మీడియం సైజ్ కాయి తీసుకొని చిన్న ముక్కలుగా తరిగి కొంచెం లైట్ గా పసుపు, ఉప్పు వేసి దాన్ని కూడా వేపించుకోండి .అవి పక్కన పెట్టిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు పెద్ద టమాటాలు ముక్కలు కోసుకొని వేసుకోండి. 

నిమ్మకాయ సైజు చింతపండు, రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసి టమాటాలు మగ్గ పెట్టుకోండి. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి .తర్వాత రోటిలో చేసుకుంటే టేస్టే వేరు అందరికీ తెలిసిందే, కావాలనుకుంటే మిక్సీ జార్ లో కూడా చేసుకోవచ్చు. అయితే ముందుగా రోటి లో  వేపిన పప్పులు  శనగపప్పు, మినప గుళ్ళు ఇవి వేసి దంచుకోండి .మిక్సీలో అయితే కచ్చాపచ్చాగా వేసుకోండి. 

రోట్లో ఎలాగో మనకి కొంచెం బరక తగులుతుంది .ఇప్పుడు ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వాటిని కూడా దంచుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసి దంచండి .ఇప్పుడు మగ్గిన టమాటాలను కూడా వేసి దంచుకోండి .ఇప్పుడు మగ్గ పెట్టిన దోసకాయ ముక్కల్ని కూడా కొంచెం కొంచెంగా వేస్తూ దంచుకోండి.

 కొంచెం ముక్కలు పచ్చడ్లో కలపడానికి పెట్టుకోండి. ఒక ఉల్లిపాయ కూడా వేసి దాన్ని కూడా దంచితే ఆ రుచి వేరు ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ దంచుకుంటూ ఉంటే రోట్లో రుచి అమోఘంగా ఉంటుంది. ఈ నలిగిన పచ్చడ్ని పక్కన పెట్టుకున్న ముక్కల్లో వేసి కలుపుకోండి .ఇది రెండు రోజులు కూడా నిల్వ ఉంటుంది. చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు చేసి చూడండి.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top