Sambar Premix recipe:ఈ ఒక్కపొడితో నిమిషాల్లో ఘుమఘుమలాడే కమ్మని సాంబార్ రెడీ

ప్రీమిక్స్ పౌడర్స్ వల్ల చాలా ఉపయోగం. వంట బాగా రాని వాళూ ఎవరైనా ఉంటే కూడా చేసి ఇవ్వచ్చు .అలాగే పిల్లలు, వర్కింగ్ ఉమెన్,  ఇవన్నీ చేసుకోలేరు కాబట్టి  ఇలా instant చేసి ఇవ్వడం వల్ల వాళ్ళు సులువుగా అన్ని రకాలు ఎంజాయ్ చేయొచ్చు.  ఎవరైనా sudden గా వచ్చినప్పుడు మనకి పెద్ద పని కూడా అనిపించదు . 

చేసే విధానం:

ఒక కప్పు కందిపప్పును తీసుకొని ఒక పాన్ లో లో ఫ్లేమ్ లో దోరగా వేగించుకోవాలి .కమ్మని వాసన వస్తూ ఉంటుంది లైట్ కలర్ లో వస్తాయి , అప్పుడు వాటిని తీసి ఒక పళ్ళెంలో చల్లార పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్ లో ఒక పావు కప్పు ధనియాలు వేసి వేయించుకోండి. అవి కూడా తీసి చల్లార పెట్టుకోండి .

ఇప్పుడు మళ్ళీ పాన్లో ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని, రెండు టేబుల్ స్పూన్ల మినప గుళ్ళు ,రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, ఒక్క టీ స్పూన్ మిరియాలు, వేసుకొని లో ఫ్లేమ్ లో బాగా కలుపుతూ వేయించుకోవాలి .దీనికి రెండు టీ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకొని  ఒక్క నిమిషం ఉంచండి. 

వీటిని కూడా ధనియాలు వేసిన పళ్ళెంలోకి వేసుకోండి .ఇప్పుడు pan లో ఒక 15 ఎండు మిరపకాయలు వేసి, లో ఫ్లేమ్ లో మాడకుండా వేగించుకోవాలి .వీటిని కూడా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని కూడా పళ్లెంలో వేసుకోండి. ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి వాటిని కూడా వేపుకోవాలి. ఒక దాని తర్వాత ఒకటి ఇలా వేగించుకుని పక్కన పెట్టుకుంటూ ఉంటే, ఒకటి రోస్ట్ అయిపోవడం, మాడిపోవడం లాంటివి జరగవు. 

కాబట్టి ఒక దాని తర్వాత ఒకటి తీసి పెట్టుకోవాలి. ఈ కరివేపాకు కూడా ధనియాల పళ్లెంలో వేసుకోండి. ఇప్పుడు ఆ పాన్లోనే ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని దాని విడదీసి ఆ పాన్లో కొంచెం రోస్ట్ అయ్యేలాగా చేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన వాటిని  వేసుకోండి. ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ ఇంగువ, అర స్పూన్ పసుపు వేసి మళ్లీ గ్రైండ్ చేసుకోవాలి. 

ఒక స్పూన్ కారం కూడా వేసుకొని బాగా మెత్తగా చేసుకోండి. డ్రై అయిన చింతపండును కూడా వేసి మళ్లీ ఒకసారి ఆ పిండి మొత్తానికి కలిపి అప్పుడు బ్లెండ్ చేయండి.  చింతపండు కూడా దాంట్లో కలిసిపోతుంది. మీకు చింతపండు ఇష్టం లేకపోతే armchur పౌడర్ ని కలుపుకోవచ్చు. అంతే  చల్లారిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్ లో స్టోర్ చేసుకోండి .మనం ఎప్పుడు సాంబార్ పెట్టాలనుకుంటే అప్పుడు ఈ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top