Gutti Vankaya Biryani:గుత్తి వంకాయ‌ల‌తో ఎంతో ఘుమఘుమ‌లాడే బిర్యానీ.. ఇలా చేస్తే వదలకుండా తింటారు

Gutti Vankaya Biryani:కూరల్లో వంకాయ కూర రారాజు. వంకాయ కూర అమోఘం.. అందరికీ ఇష్టమైనది. ఇంకా బిర్యానీ అంటే అందరికీ ఇష్టం. ఆ రెండు ఇష్టాల్ని కలిపి ఒకే చోట వంకాయ బిర్యానీ రైస్ చేసుకుంటే ఇంకా సూపర్ సూపర్....

వంకాయలొ stuff చేసుకోవడానికి:
ఒక స్పూన్ వేరుశనగ గుళ్ళు, రెండు స్పూన్ల నూపప్పు, నూనె వేయకుండా ఒక బాండీలో లైట్ గా ఫ్రై చేసుకుని mixie jar లో వేసుకొని ఉన్నవన్నీ కూడా 4 యాలుకలు ,1 దాల్చిన చెక్క, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి , లవంగాలు ,కారం ,ఉప్పు ,పసుపు వేసి గ్రైండ్ చేయాలి అది పొడి అయిన తర్వాత చిన్న అల్లం ముక్క , నాలుగ వెల్లులి రేకలు. వేసి మళ్లీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని వంకాయలో స్టఫ్ గా పెట్టుకోవాలి.

ఉల్లిపాయలు రెండు ఫ్రై చేసి పెట్టుకోవాలి, 500gms వంకాయలు కడిగి స్టఫ్ పెట్టడానికి ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. కొంచెం గ్రేవీ రావడానికి వేరొక బౌల్లో పెరుగు ఒక కప్పు, ఉప్పు చిటికెడు, పసుపు, ఒక స్పూన్ కారం, ఒక నిమ్మకాయ రసం రెడీ చేసి ఉంచుకోవాలి.
రైస్ వండే విధానం:
స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెతో వాటర్ తీసుకుని ,రెండు పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు, ఒక స్పూన్ షాజీరా ,నాలుగు యాలకులు, ఉప్పు సరిపడా, ఒక స్పూన్ నెయ్యి ,ఒకటిన్నర కప్పు నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకొని 70% బాయిల్ అయ్యేవరకు ఉడికించి ఉంచుకోవాలి.

ఇప్పుడు వంకాయలు, స్టఫ్, గ్రేవీ, రైసు అని రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు వంకాయలు స్టఫ్ పెట్టేసి కొంచెం నూనె వేసి వాటిని సిమ్ లో fry చేస్తూ మూత పెట్టి ఉంచాలి .fry అయిన తర్వాత పెరుగుతో కలిపిన మిశ్రమాన్ని వేసి ఇంకొంచెం ఉడికించాలి .తర్వాత 70% బాయిల్ అయినా రైస్ తీసుకొని పైన వంకాయ గ్రేవీ వేసి, మళ్లీ కొంచెం రైస్ వేసి గార్నిష్ కి కొంచెం పుదీనా వేసి రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి . అంతే బిర్యానీ వంకాయ రెడీ.....
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top