Ragi Karappusa: హెల్దీ ఫుడ్ అంటే కష్టంగా తింటాం. అది తెలిసిన విషయమే కదా .అయితే రాగిపిండి చాలామందికి హెల్దీ అని తెలిసినప్పటికీ తినడానికి ఇష్టపడరు. ఇలా మనం స్నాక్స్ గా చేసుకుంటే పిల్లలు సైతం పెద్దలు సైతం అందరూ కారపూసని ఎలా ఎంజాయ్ చేస్తామో ఇది అలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు.
కావలసినవి:
రెండున్నర కప్పులు రాగి పిండి, అరకప్పు బియ్యప్పిండి, పావు కప్పు శనగపిండి ,ఒకటిన్నర స్పూన్ కారం, ఒకటిన్నర స్పూను ఉప్పు, అర స్పూన్ జీలకర్ర పొడి, రెండు స్పూన్ల నెయ్యి లేక బట్టర్.
చేయు విధానం:
ఒక బౌల్ తీసుకొని రాగి పిండి, బియ్యప్పిండి, శనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర పొడి నెయ్యి అన్ని వేసి బాగా కలుపుకోవాలి పావు కప్పు శనగపిండి వేస్తే సాఫ్ట్ గా వస్తాయి.. లేదంటే రాగి పిండి కొంచెం బరకగా ఉండడం వల్ల కారపూస ఇరుగుతుంది. ఇందులో water పోసుకుంటూ బాగా ముద్దగా, సాఫ్ట్ గా వచ్చేవరకు కలుపుకోవాలి.
కారపూస గుత్తి తీసుకొని దానికి లోపల భాగంలో నూనె రాసి రాగి ముద్దని నిండుగా పెట్టి ఒక మూకుడు లో సరిపడ నూనె తీసుకొని ఆ నూనెలో కారపూసని ఒత్తుకోవాలి. రెండు నిమిషాలకి మీడియం ఫ్లేమ్ లో కారపూస పైకి తేలుతుంది . వాటిని తీసి ఒక tissue పేపర్ మీద పెట్టుకుంటే క్రంచి క్రంచి రాగి కారప్పూస రెడీ...