Mango Ice Cream :సమ్మర్ లో మ్యాంగో తో డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు. మాంగో జ్యూస్,మాంగో తాండ్ర, ప్రతి సారి ఒకేలా కాకుండా డిఫరెంట్ గా మాంగో ని తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు .అలాగే మాంగో ఐస్ క్రీమ్ కూడా మనం ఇంట్లోనే తక్కువ ఇంగ్రిడియంట్స్ తో చేసుకుంటే నాచురల్ ఐస్ క్రీమ్ లాగా సూపర్ గా ఉంటుంది. సమ్మర్ లో వచ్చిన guest కి ఆఫర్ చెయ్యొచ్చు.
కావలసినవి:
250 ml fresh cream, నాలుగైదు స్పూన్ల షుగర్ పౌడర్, ఒక కప్పు బాగా మగ్గిన మామిడి పండు ముక్కలు, కొంచెం డ్రై ఫ్రూట్స్ కట్స్.
చేయు విధానం:
250 ml ఫ్రెష్ క్రీమ్ తీసుకొని 30 నిమిషాలు డీప్ ఫ్రిజ్లో పెట్టండి. మిక్సీలో వేసే ముందు డీ ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఐస్ క్రీం సాఫ్ట్ గా ఉంటుంది . ఇప్పుడో మిక్సీ జార్ కానీ ,హ్యాండ్ బ్లెండర్ గాని తీసుకొని, ఫ్రెష్ క్రీమ్ ని జార్లో వేసి , చక్కెర పొడి కూడా వేసి, మ్యాంగో పీసెస్ కూడా వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి.
మంచి texture రావటానికి కొంచెం food colour add చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు . మ్యాంగో నే ఒరిజినల్ ఫుడ్ కలర్ కాబట్టి అవసరం లేదు. మూడు నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి.
ఒక బాక్స్ లోకి గాని ప్లాస్టిక్ కంటైనర్ లో కానీ తీసుకొని బాగా కలిపి ఈక్వల్ గా లెవెల్ చేసుకోండి . నాలుగైదు గంటలు డీప్ ఫ్రిజ్లో పెట్టి తర్వాత తీసి చూస్తే సాలిడ్ స్టేట్ టెక్చర్ లో గట్టిగా ఉంటుంది.
దీన్ని తీసుకొని serve చేసుకోవచ్చు .నేచురల్ మాంగో flavour తో నాచురల్ ఐస్ క్రీమ్ లాగా బాగుంటుంది. డ్రై ఫ్రూట్ స్ప్రింకల్ చేసుకొని సర్వ్ చేసుకుంటే క్రిస్పీగా ఐస్ క్రీమ్ రెడీ.