Tamota skin Benefits In Telugu :టమోటా ఆరోగ్యానికే కాదు చర్మ సరక్షణలో కూడా బాగా సహాయపడుతుంది. టమోటాలోచర్మానికి సంబంధించి అనేక ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఆల్ఫా-బీటా కెరోటిన్,లుయూటిన్ మరియు లైకోపీన్ వంటి ప్రధాన కేరోటినాయిడ్స్ ఉండుట వలన చర్మసంరక్షణలో సహాయపడుతుంది. టమోటాలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ ఉండుట వలన UV-A ఎక్స్పోజర్ల నుంచి చర్మంకు కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది.
టమోటా మీ ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్ ని సులభంగా తొలగిస్తుంది. బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో టమోటా ముక్కతో రుద్ది పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటె బ్లాక్ హెడ్స్ సమస్య త్వరగా తగ్గిపోతుంది.
టమోటా మొటిమలను తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. టమోటాలో ఉండే విటమిన్ ఏ, సి, కె మరియు ఆమ్లధర్మ లక్షణాలు మీ ముఖంపై ఉన్న మొటిమలను తొలగించడంలో సహాయపడుతాయి. ముఖానికి టమోటా గుజ్జు రాసి పావుగంట తర్వాత సారణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటె మంచి ఫలితం ఉంటుంది.