Toothbrush :ప్రతిరోజు మనం ఉదయాన్నే పళ్ళు తోముకోవడానికి బ్రష్ ఉపయోగిస్తూ ఉంటాం. బ్రష్ బాగా అరిగి పోయాక మార్చుతూ ఉంటాం కానీ టూత్ బ్రష్ మార్చటానికి కూడా సమయం ఉంటుంది. బ్రష్ ని తప్పనిసరిగా మూడు నెలలకు ఒకసారి మార్చాలి. మార్చకపోతే దంత ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.టూత్ బ్రష్ దంతాల చుట్టూ ఉన్న ఆహారము మరియు బ్యాక్టీరియా ను సమర్థవంతంగా తోలగిస్తుంది. చిగుళ్ల వ్యాధి దంతక్షయం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అందువల్ల ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్రష్ మార్చాల్సిన అవసరం ఉంది

