Is reheating food bad :ప్రస్తుతం ఉన్న బిజీ జీవనశైలిలో చాలా మంది జంక్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నారు. చాలా మంది సింపుల్ రెడీమేడ్ ఫుడ్ తీసుకొచ్చి.. కాస్త వేడి చేసుకుని లాగించేస్తున్నారు. కానీ ఇటువంటి అలవాట్లు భవిష్యత్ లో కాలేయంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి.
రాత్రి మిగిలిన ఆహారాన్నే ఉదయం కూడా తీసుకుంటూ ఉంటారు. ఇలా కర్రీస్ ఎక్కువగా వాడుతుంటారు. రెండోసారి తినాలని అనుకున్నప్పుడు ఆహారాన్ని వేడి చేయడం సాధారణంగా చూస్తుంటాం. కానీ ఇటువంటి అలవాట్ల వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అసలు ఆహార పదార్థాలు ఎందుకు మళ్లీ వేడి చేయకూడదో మీకు తెలుసా ? ఎందుకంటే.. ఇందులో ఉండే పదార్థాలు మళ్లీ వేడిచేయడం వల్ల హానికరంగా మారతాయి. రీ ప్రాసెసింగ్ ఫుడ్స్ దానిలో ఉండే.. సహజ పోషకాలు, ఎంజైమ్స్ ని కోల్పోతాయి. కాబట్టి ఎలాంటి ఆహారాలు రీహీట్ చేయకూడదు ? అనే విషయం తెలుసుకుందాం.

చికెన్ :
సాదారణంగా ప్రతి ఒక్కరు చికెన్ ని రీహిట్ చేస్తూ ఉంటారు. చికెన్ లో ఎక్కువ ప్రొటీన్స్ ఉండుట వలన....దీన్ని మళ్లీ మళ్లీ వేడిచేయడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి చికెన్ ఎప్పుడూ రీహిట్ చేయకూడదు.

బంగాళాదుంప :
రీహీట్ చేయకూడని వాటిలో బంగాళదుంప ఒకటి. బంగాళ దుంపలు టాక్సిక్ ఫుడ్. వీటిని వేడిచేయడం వల్ల అందులో ఉండే పోషక విలువలు కోల్పోతాయి. బంగాళదుంపలను ఎప్పుడూ ఉడకబెట్టి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

బచ్చలికూర :
స్పినాచ్ లేదా బచ్చలికూరలో ఐరన్, నైట్రేట్స్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని ఎప్పుడైతే రీహీట్ చేస్తామో.. ఇందులో ఉండే నైట్రేట్స్ నైట్రిట్స్ లా మారిపోతాయి. కాబట్టి బచ్చలికూరను అస్సలు రీహీట్ చేసి తీసుకోకూడదు.

ఎగ్స్ :
కోడిగుడ్లలో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఉదయాన్నే తీసుకోవడం మంచిది. కానీ దీన్ని మళ్లీ, మళ్లీ అస్సలు వేడి చేయకూడదు. కోడిగుడ్లను రీహీట్ చేయడం వల్ల టాక్సిక్ లా మారిపోయి, జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

మష్రూమ్స్ :
మష్రూమ్స్ లో ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని వండిన తర్వాత కనీసం ఒక్కసారి కూడా వేడిచేయకూడదు.
రైస్ :
అందరూ తరచుగా రీహీట్ చేసేవాటిలో రైస్ ఒకటి. వండని రైస్ లో బ్యాక్టీరియా ఉంటుంది. మనం వండిన తర్వాత అందులో ఉండే బ్యాక్టీరియా నాశనమవుతుంది. కానీ రైస్ ని మళ్లీ రీహీట్ చేయడం వల్ల అది విషపూరితంగా మారుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.