Garlic Beauty Benefits In Telugu : వెల్లుల్లిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితేవెల్లుల్లి చర్మం మీద అద్భుతంగా పనిచేస్తుందని చాలా మందికి తెలియదు. వెల్లుల్లి అనేక రకాల చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
అయితే చర్మం మీద అప్లయ్ చేసినప్పుడు వెల్లుల్లిలో ఉండే ఘాటైన అల్లిసిన్ అద్భుతంగా పనిచేసి సమస్యలను తగ్గిస్తుంది. వెల్లుల్లిలో ఉప్పు కలిపి పేస్ట్ చేసి ఉపయోగించాలి. ఇప్పుడు ఏ విధమైన ఉపయోగాలు కలుగుతాయో తెలుసుకుందాం.
చర్మ రంద్రాలలో మురికి కారణంగా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, మొటిమలు వంటివి ఏర్పడతాయి. ఈ సమస్యలు ఏర్పడకుండా ఉండాలంటే చర్మ రంద్రాలు శుభ్రంగా ఉండాలి. చర్మ రంద్రాలను శుభ్రం చేయటానికి వెల్లుల్లి బాగా పనిచేస్తుంది.
వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు రాకుండా కాపాడుతుంది. మొటిమలకు కారణం అయినా బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. వారంలో ఒకసారి మొటిమల మీద వెల్లుల్లి పేస్ట్ ని రాస్తే మొటిమలు మరియు మొటిమల కారణంగా వచ్చే మచ్చలు కూడా తొలగిపోతాయి.
వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బ్లాక్ హెడ్స్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వారంలో రెండు సార్లు బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో రాస్తే మంచి ఫలితం కనపడుతుంది.


