Perugu Vadalu : పెరుగు వ‌డ‌ల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేస్తే ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌రు..

మ‌నం ఉద‌యం సమయంలో Breakfast లో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మ‌నం ఆహారంగా తీసుకునే అల్పాహారాల్లో పెరుగు వ‌డ‌లు ఒక‌టి. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. వీటిని తయారుచేసుకోవటం చాలా సులువు.

కావలసిన పదార్దాలు
మినప్పప్పు - 300 గ్రా
పెరుగు -1 లీటరు
నూనె -1/2 లీటరు
జీలకర్ర - ఒక స్పూన్
ఉప్పు - సరిపడా

పోపుకి:-
మినప్పప్పు - ఒక స్పూన్
జీలకర్ర - ఓకే స్పూన్
ఆవాలు - ఒక స్పూన్
మెంతిగింజలు - చిటికెడు
కరివేపాకు రెబ్బలు - రెండు
కొత్తిమీర - సరిపడా
పచ్చిమిర్చి - 6
చిన్న అల్లం ముక్క.

తయారుచేసే విధానం
మినప్పప్పును ముందు రోజు రాత్రి నానబెట్టాలి. ఉదయం పప్పును పొట్టు లేకుండా కడిగి సరిపడా ఉప్పు,జీలకర్ర వేసి గట్టిగా కాకుండా మధ్యస్తంగా మిక్సీ చేయాలి.

పెరుగు కమ్మగాను,గట్టిగాను ఉండాలి.పెరుగులో చిటెకడు పసుపు,సరిపడా ఉప్పు వేసి కలపాలి. అల్లం,పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి రెండు స్పూన్ల నూనె వేసి కాగాక మినప్పప్పు,ఆవాలు,జీలకర్ర,మెంతులు వెయ్యాలి. ఇవి కొంచెం వేగాక అల్లం,పచ్చిమిర్చి పేస్ట్,కరివేపాకు,కొత్తిమీర వేసి వేగాక పైన తయారుచేసి పెట్టుకున్న పెరుగులో దీనిని వేసి బాగా కలపాలి.

ఇప్పుడు మరల వేరొక బాండి పెట్టుకొని అర లీటర్ నూనె పోసి కాగాక,దానిలో పైన మిక్సీ చేసి పెట్టుకున్న పిండిని నిమ్మకాయంత సైజ్ లో తీసుకోని ఒక ప్లాస్టిక్ కాగితం మీద గారెలగా వత్తి మధ్యలో రంద్రం చేసి వేగించాలి. 

ఇవి గోల్డ్ కలర్ వచ్చాకా,చన్నీళ్ళు ఉన్న గిన్నెలో వేసి,ఆ తర్వాత పెరుగులో వేయాలి. ఎందుకంటే వేడి గారెలను ముందే పెరుగులో వేస్తె విరిగిపోతాయి. అందువల్ల ముందు నీటిలో వేయాలని మర్చిపోవద్దు. అంతే రుచికరమైన ఆవడలు రెడీ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top