Henna Powder For Hair : మనం సాధారణంగా హెన్నా పౌడర్ ని మార్కెట్లో కొంటూ ఉంటాం. ఈ పొడిలో ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. హెన్నా పొడిని ఇంటిలో తయారు చేసుకుంటే దాదాపుగా 6 నెలల వరకు వాడుకోవచ్చు. మార్కెట్లో కొన్న పొడిలో కొన్ని కెమికల్స్ వాడుతారు. కాబట్టి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ పొడి ని వారంలో రెండుసార్లు వాడితే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అలాగే జుట్టు కుదుళ్ళు దృఢంగా మారి జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇక హెన్నా పొడి ఎలా తయారుచేయాలో చూద్దాం.
1/2 కేజీ గోరింటాకును తీసుకుని శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్ పై రెండు రోజులపాటు నీడలో ఆరబెట్టాలి. ఆ తర్వాత ఎండలో ఆరబెట్టాలి. పది ఉసిరికాయలను తీసుకుని ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టాలి. 20 మందార పూలు, 20 మందార ఆకులు, గుప్పెడు వేపాకులు శుభ్రంగా కడిగి రెండు నుంచి మూడు రోజులపాటు ఆరబెట్టాలి.
గోరింటాకు, మందార ఆకు, వేపాకు, మందార పూలు అన్ని చేతితో కలిపితే పౌడర్ అయ్యేంతవరకు ఎండబెట్టాలి. ఉసిరి ముక్కలు కూడా బాగా ఎండాలి. మిక్సీలో వీటిని అన్నింటిని వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి.
ఈ పొడి వారంలో రెండు సార్లు వాడాలి. ఒక బౌల్లో హెన్నా పొడి తీసుకొని పెరుగు లేదా నిమ్మరసం, కొంచెం నీటిని పోసి బాగా కలిపి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి గంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చెయ్యాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.