
కావలసిన పదార్ధాలు
ఒక కప్పు బియ్యప్పిండి
ఒక కప్పు ఓట్స్
పావు కప్పు రవ్వ
ఒక స్పూను ఉప్పు
నాలుగు కప్పుల నీరు
సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ
రెండు మిరపకాయలు (సన్నగా తరిగినవి)
రెండు టేబుల్ స్పూన్ కొత్తిమీర (సన్నగా తరిగినది)
రెండు టేబుల్ స్పూన్ల కరివేపాకు (సన్నగా తరిగినది)
ఒక స్పూన్ జీలకర్ర
తయారి విధానం
పొయ్యి వెలిగించి పాన్ పెట్టి ఒక కప్పు Oats వేసి క్రంచీగా మారే వరకు డ్రై రోస్ట్ చేయాలి. ఓట్స్ చల్లారాక పొడిగా చేసుకోవాలి. ఒక గిన్నెలో ఒక కప్పు ఓట్స్ పొడి, ఒక కప్పు బియ్యప్పిండి, పావు కప్పు రవ్వ, ఒక స్పూన్ ఉప్పు, నాలుగు కప్పుల నీరు పోసి బాగా కలపాలి.
దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసి బాగా కలపాలి. పావుగంట తర్వాత దోశలను వేసుకుంటే క్రిస్పీ ఓట్స్ దోస రెడీ.