కడుపు నొప్పి అనేది చాలా సర్వ సాదారణమైన ఆరోగ్య సమస్య. పైకి చిన్న సమస్యగా కనిపించినా దీని వలన కలిగే అసౌకర్యం అసాదారనంగా ఉంటుంది. అసలు ఈ సమస్య ఎలా వస్తుంది. దీనిని ఎలా నివారించవచ్చో తెలుసుకుందాము.
కడుపు నొప్పి ఎందుకు వస్తుంది?
ఆహారాన్ని నమలకుండా గబగబా తినటం వలన తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండా కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది.
ఆకలికి మించి ఆహారం అధికంగా తీసుకోవటం కూడా ఒక కారణం కావచ్చు. పదార్దాలు రుచిగా ఉన్నాయని అతిగా తినకూడదు. మిత ఆహారమే అన్ని విధాల మంచిది.
జీవన విధానంలో వచ్చిన మార్పులు కూడా కడుపు నొప్పికి కారణం అవుతుంది. ఒకే రకమైన జీవన విధానాన్ని పాటించం అన్ని రకాలుగా శ్రేయస్కరం.
ఆహారం తీసుకొనే విషయంలో సమయపాలన పాటించకపోవటం,కొన్ని సందర్భాలలో భోజనం పూర్తిగా మానివేయుట వంటివి కూడా కడుపు నొప్పికి దారితీస్తాయి.
నివారణ పద్దతులు
భోజనం చేసిన వెంటనే అరగ్లాస్ పైనాపిల్ జ్యూస్ తీసుకోవటం ద్వారా కడుపు నొప్పి,అజీర్ణం నుండి తప్పించుకోవచ్చు.
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో స్పూన్ నిమ్మరసం,స్పూన్ అల్లం తురుము, 2 స్పూన్ తేనే కలిపి త్రాగితే కడుపు నొప్పి,అజీర్ణంనకు బాగా పనిచేస్తుంది.
భోజనానికి ముందు గ్లాస్ వేడినీటిలో స్పూన్ నిమ్మరసం కలిపి త్రాగాలి. ఇది త్రాగిన అరగంట తర్వాత ఆహారం తీసుకుంటే అజీర్ణం సమస్య రాదు.
ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ జీలకర్ర వేసి మరిగించి, ఆ నీటిని వడకట్టి త్రాగాలి.
భోజనానికి ముందు చిన్న అల్లం ముక్క, చిటికెడు ఉప్పు కలిపి నమిలి ఆ రసాన్ని మింగాలి. ఆ తర్వాత ఆహారం తిసికుంటే అజీర్ణం సమస్య రాదు.
భోజనం చేసిన ప్రతి సారి కొద్దిగా సోంపు తింటే అజీర్ణం సమస్య ఉండదు.
భోజనం అనంతరం ద్రాక్ష,ఆరెంజ్ వంటి పళ్ళను తీసుకున్నా మంచి పలితాన్ని పొందవచ్చు.