మనం సాధారణంగా ప్రతి రోజు కరివేపాకును ఉపయోగిస్తూ ఉంటాం. కరివేపాకు లేనిదే కూర వండటం అంటూ జరగదు. కరివేపాకు వంట రుచిని పెంచడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కరివేపాకుతో టీ తయారు చేసుకుని తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
ఒక గ్లాసు నీటిలో 20 నుంచి 25 కరివేపాకులను వేసి మరిగించి ఆ నీరు సగం అయ్యాక వడగట్టి నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగితే మంచిది. కరివేపాకు టీని ప్రతిరోజు తాగుతూ ఉంటే... శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జీర్ణ ఎంజైమ్ లను ఉత్తేజపరిచి ప్రేగు కదలికలను మెరుగుపరిచి జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండేలా చేసి గ్యాస్, డయేరియా, మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది.
గర్భాదరణ సమయంలో ఈ టీ తీసుకుంటే వాంతులు, వికారం వంటివి ఉండవు. ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది. రోజంతా అలసిపోయి ఉన్నప్పుడు ఒక కప్పు కరివేపాకు టీ తాగితే మంచి విశ్రాంతి కలుగుతుంది. విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.