కొత్తవారిని కలుసుకోగానే మన చూపులు ముందుగా పడేది వారి ముఖం మీదే! ముఖ్యంగా స్త్రీల విషయంలో పెదవులు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయి. ముఖంలోని మిగతా భాగాల కన్నా పెదవులు సున్నితమైనవి.
వాటి సంరక్షణ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటే అందమైన,మృదువైన పెదాలను సొంతం చేసుకోవచ్చు. అలాంటి పెదవుల సంరక్షణకు సంబందించిన చిట్కాలను తెలుసుకుందాము.
పెదాల మాయిశ్చరైజ్ కొరకు తేనే లేదా గ్లిజరిన్ బాగా పనిచేస్తుంది. పెదవులు ఎండినట్లు అనిపించినప్పుడు తేనే లేదా గ్లిజరిన్ రాయాలి. ఇది రాసిన కొద్దిసేపటి వరకు ఏమి తినకుండా,త్రాగకుండా ఉంటే మంచిది.
రాత్రి పడుకొనే ముందు అలోవేర ముద్దను పెదాలకు రాసి,ఉదయం నిద్ర లేచిన తర్వాత గోరువెచ్చని నీటితో పెదాలను శుభ్రం చేసుకోవాలి.
పెదాలను సున్నితంగా ఉంచటానికి నిమ్మరసం బాగా సహాయపడుతుంది. అందువల్ల ఉదయం,సాయంత్రం పెదాలకు నిమ్మరసం రాయండి.
వీట్ జర్మ్ ఆయిల్,టమోటా జ్యూస్,పాలకూర జ్యూస్ మూడింటిని సమంగా తీసుకోని కలిపి ఈ మిశ్రమాన్ని పెదవులకు రాస్తే మృదువుగా మారటమే కాకుండా గులాబి రంగుకు మారే అవకాశం ఉంది.
పెదవులు ఎరుపు రంగులో ఉండాలంటే కొన్ని ఎరుపు గులాబి రేకులను తీసుకోని పెదాలపై రుద్దాలి. పెదాలకు సహజసిద్దమైన ఎరుపు రంగును గులాబి రేకులు ఇస్తాయి.
తాజా ఆకుకూరలు,పండ్లు ఆహారంలో ఉండేటట్లు చూసుకోవాలి. రోజుకి 10 నుంచి 12 గ్లాసుల నీటిని త్రాగటం మంచిది. నీరు పెదాలను తేమగా ఉంచుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

