Pimples on Face:టీనేజి అమ్మాయిలను బాధించే అంశాలలో మొటిమలు మొట్టమొదటివి. వీటి వల్ల వారి అందం దెబ్బతింటుందని తెగ బాధపడిపోతూ ఉంటారు. వీటి నివారణకు మార్కెట్ లో దొరికే వివిధ రకాల సౌందర్య సాధనాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు.
మొటిమల నివారణకు సౌందర్య సాదనాల కన్నా ఇంటి చిట్కాలే బాగా సహాయపడతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము.
వంటసోడా
ఒక స్పూన్ వంటసోడాలో కొద్దిగా నీరు పోసి పేస్ట్ చేసి మొటిమలు ఉన్న ప్రాంతంలో అప్లై చేసి పావుగంట అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి పలితాన్ని పొందవచ్చు.
గట్టిపెరుగు
పెరుగులో ఉండే విటమిన్స్,మినరల్స్ ఆరోగ్యానికే కాకుండా మొటిమల నివారణకు కూడా దోహదపడతాయి. గట్టి పెరుగును మొటిమల మీద అప్లై చేసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా వారం రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే మంచి పలితాన్ని పొందవచ్చు.
పుదినా రసం
స్నానానికి ముందు ముఖం మీద మొటిమలు ఉన్న ప్రాంతంలో పుదినా రసం రాసి ఆరిన తర్వాత స్నానం చేయాలి.
నిమ్మకాయ
నిమ్మరసంలో దూది ముంచి మొటిమలు ఉన్న ప్రాంతంలో తేలిగ్గా రబ్ చేయాలి. కొన్ని రోజుల పాటు ఈ విధంగా చేసినట్లతే మొటిమలు,మచ్చలు పోతాయి.
టమాటో
టమాటో ను గుండ్రంగా కోసి మొటిమల మీద పెట్టుకొని పావుగంట పాటు కదలకుండా పడుకోవాలి. రోజుకి రెండు సార్లు ఈ విధంగా చేసినట్టైతే మొటిమలు క్రమంగా తగ్గుతాయి.
కీర
కీర ముక్కలను పేస్ట్ చేసి మొటిమలు ఉన్న ప్రాంతంలో రాయాలి.
తేనే,యాలకుల పొడి
తేనే,యాలకుల పొడి రెండింటిని సమ బాగాలుగా తీసుకోని పేస్ట్ చేసి రాత్రి పడుకొనే ముందు మొటిమలు ఉన్న ప్రాంతంలో రాయాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తే మొటిమలతో పాటు మచ్చలు కూడా పోతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


