Vomiting Problems:వాంతులు,వికారం తగ్గాలంటే అద్భుతమైన చిట్కాలు..అసలు మిస్ కావద్దు

Vantulu Taggataniki chitkalu :సీజన్ మారింది. దాంతో చాలా మందికి తీసుకున్న ఆహారం జీర్ణం కాక వాంతులు అవుతూ ఉంటాయి. వాంతులు అవుతూ ఉంటే చాలా చికాకుగా ఉంటుంది. అంతేకాకుండా విపరీతమైన నీరసం కూడా ఉంటుంది. వాంతుల నుండి బయట పడటానికి కొన్ని అద్భుతమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఎక్కువగా రోడ్డు పక్కన అమ్మే పదార్ధాలు,నూనె వస్తువులు తినకుండా ఉంటేనే మంచిది.

వేడి నీటిని పుక్కిలించిన మంచి ప్రయోజనం ఉంటుంది.

ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తీసుకున్న వాంతులు తగ్గుతాయి.

ఒక గ్లాస్ మజ్జిగలో ఒక స్పూన్ జీలకర్ర పొడి లేదా మెంతి పొడి తీసుకున్న వెంటనే ఉపశమనం కలుగుతుంది.

వికారం,వాంతులకు టీ బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా హెర్బల్ టీ త్రాగితే చాలా మంచిది.

లవంగం, యాలుకలు పొడి, అల్లం, పుదీనా, తేనె వంటివి నిమ్మరసంతో కలిపి తీసుకుంటే వాంతి వచ్చే వికార భావన పోతుంది.

నిమ్మరసం, కొబ్బరినీరు, మజ్జిగ వంటి ద్రవ పదార్ధాలను ఎక్కువగా తీసుకోవటం వలన జీర్ణ వ్యవస్ధ శుభ్రపడి హాయిగా ఉంటుంది.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ వాంతులు తగ్గకుండా ఇంకా ఎక్కువ అయితే మాత్రం ఎటువంటి అశ్రద్ధ చేయకుండా డాక్టర్ ని సంప్రదించి మందులు వాడాలి. ఈ చిట్కాలు వాంతులు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి. వాంతులు ఎక్కువగా ఉన్నప్పుడు అసలు అశ్రద్ధ చేయకూడదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top