దంతాలు పసుపుపచ్చగా మారాయని బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో దంతాలను తెల్లగా మెరిసేలా చేయవచ్చు.దంతాలు పాలిపోవటం అనేది వృద్ధాప్య ప్రక్రియలో ఒక బాగం. అయితే దంతాల మీద మరకలు, పాలిపోవటం వంటి సమస్యలకు సులభమైన ఇంటి పరిష్కారాలు ఉన్నాయి.
బేకింగ్ సోడా మరియు నిమ్మకాయ
ఇది దంతాలను తెల్లగా చేయటానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.నిమ్మరసం,బేకింగ్ సోడా యొక్క రసాయన చర్య కారణంగా దంతాలు తెల్లగామెరుస్తాయి. ఈ రెండు కలవటం వలన చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
ఈ ద్రావణాన్ని వారానికి ఒకసారి మాత్రమే ఉపయోగించాలి. చిగుళ్ళకు చికాకుగా ఉంటే మాత్రం బేకింగ్ సోడా వాడకాన్ని ఆపేయాలి. అంతేకాక ఎనామిల్ కి హానికలుగుతుందని భయం ఉంటే ఇతర పరిష్కారాల కోసం చూడాలి.
ఒక బౌల్ లో తాజా నిమ్మరసం తీసుకోని దానిలో కొంచెం బేకింగ్ సోడా కలపాలి. ఈమిశ్రమాన్ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పళ్లకు రాయటానికి ముందు పళ్ళ మీదఉన్న లాలాజలంను కాటన్ బాల్ తో శుభ్రం చేయాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పళ్ళమీద రాసి ఒక నిమిషం అయ్యాక నిదానంగా బ్రష్ చేయాలి. ఈ మిశ్రమాన్ని దంతాలమీద ఒక నిమిషం కన్నా ఎక్కువ సమయం ఉంచకూడదు. ఒకవేళ ఉంటే కనుక ఎనామిల్ దెబ్బతింటుంది.