Mango pakodi:పుల్లని రుచిలో ఉండే మామిడికాయను అందరూ ఇష్టపడతారు. ఎప్పుడు చేసుకొనే పకోడీ మాదిరిగా కాకుండా మామిడి కాయతో పకోడీ చెఉస్కున్తె పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది.
కావలసిన పదార్ధాలు
శనగపిండి - 3/4 కప్పు
పచ్చి మామిడి కాయ తురుము - 1/4 కప్పు
ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్పు
స్ప్రింగ్ ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్పు
కొత్తిమీర ఆకులు - 1/4 కప్పు
చాట్ మసాలా - అర టీ స్పూన్
కరివేపాకు - కొంచెం
పుదినా - కొద్దిగా
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్
జీలకర్ర పొడి - అర టీ స్పూన్
పచ్చిమిరప - 2 (ముక్కలుగా చేసుకోవాలి)
తినే సోడా - చిటికెడు
సోంపు గింజలు - అర టీ స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నూనె - వేగించటానికి సరిపడా
తయారీ విధానం
ఒక పెద్ద బౌల్ తీసుకోని దానిలో శనగపిండి,పచ్చి మామిడి కాయ తురుము, ఉల్లిపాయ ముక్కలు, స్ప్రింగ్ ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఆకులు, చాట్ మసాలా, కరివేపాకు,పుదినా,అల్లం,వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి,పచ్చిమిరప ముక్కలు, తినే సోడా, సోంపు గింజలు, ఉప్పు,కొంచెం నీరు పోసి అన్నింటిని బాగా కలపాలి. ఇది పలచగాను,గట్టిగాను లేకుండా మధ్యస్థంగా ఉండాలి.
ఇప్పుడు పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి వేడెక్కినాక పై మిశ్రమాన్ని పకోడీ మాదిరిగా వేసుకొని గోల్డ్ కలర్ వెచ్చే వరకు వేగించాలి. అంతే నోరురుంచే మామిడి కాయ పకోడీ రెడీ. దీనికి సాస్ లేదా పుదినా చట్ని మంచి కాంబినేషన్.