Black Chickpea Dosa :ఉదయం బ్రేక్ ఫాస్ట్ మంచి పోషకాలతో తింటే రోజంతా నీరసం, అలసట లేకుండా హుషారుగా ఉంటాం. రుచిగా ఆరోగ్యంగా కావాలంటే ఇప్పుడు చెప్పే నల్ల శనగల అట్లు ట్రై చేయండి. ఒక అట్టు తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.
కావలసిన పదార్ధాలు
2 కప్పుల నల్ల శనగలు
4 కప్పుల బియ్యం
3 పచ్చిమిర్చి
అల్లం – ఇంచ్
1 tsp జీలకర్ర
2 రెబ్బలు కరివేపాకు
1/4 tsp పసుపు
ఉప్పు
నీళ్ళు పిండి రుబ్బుకోవడానికి
నూనె అట్టు కాల్చడానికి
తయారి విధానం
నల్ల శనగలు, బియ్యం శుభ్రంగా కడిగి నీటిని పోసి ఆరు నుంచి ఏడు గంటల పాటు నానబెట్టాలి. నానిన శనగలు, బియ్యంను శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేయాలి. ఆ తర్వాత అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, నీళ్లు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
ఈ మిశ్రమంను ఒక బౌల్లోకి తీసుకుని కొంచెం పసుపు వేసి నీళ్లు పోసి అట్లు పిండిలా జారుగా కలుపుకోవాలి. వేడెక్కిన పెనం మీద అట్టు మాదిరిగా స్ప్రెడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా కాల్చి మరో వైపు తిప్పి కాల్చుకోవాలి. ఈ అట్టుకు అల్లం పచ్చడి చాలా బాగుంటుంది.