
మనం సాదారణంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ,Dosa వంటివి చేసుకుంటాం. వాటి కోసం ప్రతి రోజు చెట్నీ చేసుకోకుండా నిల్వ ఉండే పచ్చడి చేసుకుంటే దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఆంధ్రా స్టైల్ “అల్లం పచ్చడి” చేసుకుందాం. ఫ్రిజ్ లో పెడితే నెల రోజుల పాటు పచ్చడిని ఎంజాయ్ చేయవచ్చు.
కావలసిన పదార్ధాలు
200 గ్రాముల పచ్చిమిర్చి
75 గ్రాముల అల్లం
100 గ్రాముల బెల్లం
50 - 70 గ్రాముల చింతపండు
ఉప్పు – రుచికి సరిపడా
వేడి నీళ్ళు
2 స్పూన్ల నూనె
తాలింపు కోసం
2 స్పూన్ నూనె
1 స్పూన్ అవాలు
1 స్పూన్ జీలకర్ర
2 రెబ్బలు కరివేపాకు
2 ఎండుమిర్చి
తయారి విధానం
పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె వేసి పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించాలి. ఆ తర్వాత అల్లం ముక్కలు వేసి వేగించాలి. మిక్సీ జార్ లో వేగిన పచ్చిమిర్చి ముక్కలు,అల్లం ముక్కలు, బెల్లం, చింతపండు,ఉప్పు, సరిపడా నీటిని పోసి మెత్తని పేస్ట్ గా చేయాలి.
మూకుడులో నూనె వేసి వేడి చేసి ఆవాలు,జీలకర్ర,కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేగించి తయారుచేసుకున్న పచ్చడిలో కలపాలి. ఈ పచ్చడిని వేడి నీళ్ళతో రుబ్బితే ఫ్రిజ్లో కనీసం నెల రోజులు నిలవ ఉంటుంది.