Oats breakfast:బరువు తగ్గాలంటే కష్టపడే పని లేకుండా ఇలా ఇష్టంగా చేసుకుని తింటే చాలు

Oats breakfast:ఓట్స్ బ్రేక్‌ఫాస్ట్ ని ప్రతి రోజు ఉదయం తీసుకుంటే బరువు తగ్గటమే కాకుండా రోజంతా అలసట,నీరసం లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. ఓట్స్, కూరగాయలతో చేస్తే ఈ ఓట్స్ బ్రేక్‌ఫాస్ట్ చాలా రుచిగా ఉంటుంది.

కావలసిన పదార్ధాలు 
1/2 కప్పు ఓట్స్
1 ఉల్లిపాయ (సన్నగా తరిగిన)
1 క్యాప్సికమ్ (సన్నగా తరిగినది)
2 పచ్చి మిరపకాయలు (సన్నగా తరిగినవి)
1 టమోటా (సన్నగా తరిగిన)
1/2 టీస్పూన్ పసుపు పొడి
3/4 స్పూన్ ఉప్పు
1/2 స్పూన్ మిరియాల పొడి
1/2 కప్పు కొత్తిమీర ఆకులు
1 టేబుల్ స్పూన్ నూనె

తయారి విధానం
పొయ్యి వెలిగించి పాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేసి ఉల్లిపాయ ముక్కలను వేసి కొంచెం వేగాక, సన్నగా తరిగిన క్యాప్సికమ్ మరియు 2 పచ్చిమిర్చి వేసి కొంచెం వేగాక, తురిమిన క్యారెట్ మరియు నచ్చిన బ్రోకలీ, గుమ్మడికాయ లేదా బచ్చలికూర వంటి ఏదైనా కూరగాయలను వేయవచ్చు.

కొంచెం వేగాక సన్నగా తరిగిన టొమాటో వేయాలి. టొమాటో ముక్కలు మెత్తబడే వరకు వేయించి బాగా కలపాలి. ఆ తర్వాత 1/2 టీస్పూన్ పసుపు పొడి, 3/4 టీస్పూన్ ఉప్పు, 1/2 టీస్పూన్ మిరియాల పొడి లేదా కారం పొడి వేసి బాగా కలపాలి.

ఆ తర్వాత అల్లం వెల్లుల్లి మిశ్రమం వేసి వేగించాలి. అల్లం,వెల్లుల్లి మిశ్రమం ఇష్టం లేనివారు మానేయవచ్చు. ఆ తర్వాత అర కప్పు ఓట్స్ వేసి నీటిని పోసి బాగా ఉడికించాలి. చివరగా కొత్తిమీర, నిమ్మరసం కలపాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top