Tomato Rasam : టమోటా రసం ఇప్పుడు చెప్పే విధంగా పెడితే చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. నాటు టమాటాలు అయితే ఈ రసం చాలా రుచిగా ఉంటుంది. చింతపండు పులుసు కాస్త ఎక్కువగా వేసుకోవాలి.
కావాల్సిన పదార్థాలు
నాలుగు పండిన నాటు టమోటాలు
చిన్న కట్ట కొత్తిమీర కాడలు
ఒక స్పూన్ మిరియాలు
ఒక స్పూన్ జీలకర్ర
పది వెల్లుల్లి రెబ్బలు
ఒక కరివేపాకు రెబ్బ
రెండు టేబుల్ స్పూన్ల చింతపండు
రెండు పచ్చిమిర్చి చీలికలు
పసుపు
రాళ్ల ఉప్పు
తాళింపు
రెండు స్పూన్ల నూనె
ఒక స్పూన్ ఆవాలు
ఒక స్పూన్ మినప్పప్పు
ఇంగువ
నాలుగు ఎండుమిర్చి
ఒక రెప్ప కరివేపాకు
తయారీ విధానం
టమోటాను ముక్కలుగా కట్ చేసుకొని దానిలో కొత్తిమీర కాడలు వేసి గట్టిగా పిండుతూ రసాన్ని తీయండి. ఆ తరువాత మిగిలిన పిప్పి తీసేసి రసంలో ½ లీటర్ నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత మిక్సీలో జీలకర్ర , మిరియాలు, వెల్లులి, కరివేపాకు వేసి కచ్చపచ్చగా దంచాలి.
గిన్నెలో టమోటా రసం పోసి అందులో పచ్చిమిర్చి చీలికలు వేసి మూతపెట్టి పచ్చిమిర్చి మెత్తబడే దాకా మరిగించాలి. ఆ తర్వాత జీలకర్ర మిశ్రమం వేసి పసుపు, ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్ మీద రెండు పొంగులు వచ్చాక పొయ్యి ఆఫ్ చేయాలి.
ఒక మూకుడు పొయ్యి మీద పెట్టి ఒక స్పూన్ నూనె వేసి ఆవాలు, మినపప్పు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి బాగా వేగించాలి. బాగా వేగిన తాలింపును రసంలో కలపాలి.