
కావాల్సిన పదార్థాలు
బీరకాయలు – 2
ఆయిల్ – 3 టేబుల్ స్పూన్స్
జీలకర్ర – ½ టీ స్పూన్
ఎండు మిర్చి - 8
పచ్చిమిర్చి - 6
ధనియాలు – 1 టీ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 6
నవ్వులు - 2 టేబుల్ స్పూన్స్
ఉప్పు- తగినింత
పసుపు - ½ టీ స్పూన్
చింతపండు - కొద్దిగా
తాలింపు గింజలు – 1 టీ స్పూన్
కరివేపాకు – 1 రెమ్మ
తయారీ విధానం
1.బీర కాయలను తొక్క తీయకుండా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2.స్టవ్ ఆన్ చేసి, కడాయి పెట్టుకుని, రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి.
3. వేడెక్కిన నూనెలో జీలకర్ర ,ధనియాలు, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు వేసుకుని,లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి.
4. ఇప్పుడు నువ్వులు వేగాక, బీయకాయ ముక్కలను యాడ్ చేసుకుని , ఉప్పు, పసుపు వేసి బాగా కలపండి.
5. కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుని , బాండీకి మూత పెట్టి, మెత్త పడేంతవరకు, మధ్య మధ్య లో కలుపుతూ మగ్గించుకోవాలి.
6. స్టవ్ హాఫ్ చేసుకుని బీరకాయ ముక్కలు చల్లారే వరకు వెయిట్ చేయాలి.
7.చల్లారిన ముక్కలను మిక్సీ జార్లోకి తీసుకుని, కొద్దిగా నీరు యాడ్ చేసుకుని, మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
8. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై కడాయి పెట్టుకుని, ఒక టేబుల్ ఆయిల్ యాడ్ చేసుకోండి.
9. నూనె వేడెక్కిన తర్వాత, తాలింపు గింజలు వేసుకోవాలి. అందులోకి రెండు ఎండు మిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, రెండు వెల్లుల్లి రెబ్బలు, యాడ్ చేసుకుని, వేడి వేడి నూనెలో గ్రైండ్ చేసుకున్న బీరకాయ పేస్ట్ ను వేసుకోండి.
10. అంతే బీరకాయ నువ్వుల పచ్చడి రెడీ.