Pumpkin seeds Benefits in Telugu : ఒకప్పుడు చాలా అరుదుగా లభించే డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు చాలా విరివిగా లభిస్తున్నాయి. కొన్ని కాస్త ధర ఎక్కువైనా వాటికీ తగ్గట్టుగా ప్రయోజనాలను అందిస్తున్నాయి.
మనకు ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా గుమ్మడి గింజలను వాడుతున్నారు. ప్రతి రోజు ఒక స్పూను గుమ్మడి గింజలను తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
గుమ్మడికాయ గింజలలో ఆర్గనైన్ అనే సమ్మేళనం సమృద్ధిగా ఉండటం వలన రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా కాపాడి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
అలాగే ఈ గింజలలో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాల స్థితిస్థాపకతను పెంచి గుండె వ్యాధులు రాకుండా కాపాడుతుంది. వీటిలో ఉండే శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్, విటమిన్ ఈ, ఫినోలిక్ సమ్మేళనాలు శరీరంలో కణజాలాన్ని రక్షిస్తాయి. అలాగే శరీర పోషణ మరియు శారీరక నిర్మాణంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి.
డయాబెటిస్ ఉన్నవారు ప్రతి రోజు రెగ్యులర్ గా ఈ గింజలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే అధిక బరువును తగ్గించడంలో కూడా చాలా బాగా సహాయపడతాయి. ఎందుకంటే ఈ గింజలలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన ఆకలి నియంత్రణలో ఉండేలా చేస్తుంది. దాంతో అధిక బరువు తగ్గుతారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.