Cleaning Hacks:కప్పు నుంచి టీ/కాఫీ మరకలు తొలగించాలంటే...సింపుల్ టిప్స్

Cleaning Hacks: మనలో చాలా మంది ప్రతి రోజు కాఫీ లేదా టీ తాగుతూ ఉంటారు. అలా ప్రతి రోజు తాగటం వలన టీ, కాఫీ తాగే కప్పులు, గ్లాసుల మీద మరకలు పడుతూ ఉంటాయి. అలా మరకలు పడితే చూడటానికి చిరాకుగా ఉంటుంది.

ఈ మరకలను ఎంత శుభ్రం చేసినా వదలవు. అయితే ఈ మరకలను తొలగించటానికి ఇప్పుడు చెప్పే చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఈ చిట్కాలకు ఉపయోగించే అన్ని వస్తువులు మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి.

బేకింగ్ సోడా మరకలను తొలగించటానికి చాలా సమర్ధవంతంగా పని చేస్తుంది. ఒక స్పూన్ బేకింగ్ సోడాలో నీటిని పోసి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని మగ్‌లోని మరక ఉన్న ప్రాంతాలపై రాసి
మృదువైన బ్రష్‌తో రుద్దండి. ఆ తర్వతా నీటితో శుభ్రం చేస్తే.. మరక మాయం అవుతుంది.

మరకపడిన కప్పులో లేదా గ్లాస్‌లో తాజా నిమ్మరసాన్ని పిండి... 15 నుంచి 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత దీన్ని బ్రష్‌తో సున్నితంగా స్క్రబ్ చేసి, నీళ్లతో శుభ్రం చేస్తే.. కప్పు తళతళ మెరుస్తుంది.

కాఫీ/టీ కప్పు మరకలను వదిలించడానికి ఉప్పు చాలా బాగా పనిచేస్తుంది. కప్పు నీళ్లతో తడిపి, ఉప్పును చల్లండి. దీన్ని కొంత సేపు ఆరనిచ్చి, ఆ తర్వత బ్రష్‌తో రుద్దండి. ఇలా చేస్తే.. మరకలు సులభంగా మాయం అవుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. 

Click Here To Follow TeluguLifeStyle On Google News
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top