
కావాల్సిన పదార్థాలు
గోధుమ రవ్వ – 1 కప్పు
నీళ్లు – 1 కప్పు
పులిసిన పెరుగు – 1/2 కప్పు
పుట్నాలు – 1 కప్పు
పచ్చిమిర్చి – 6
అల్లం – 1 ఇంచ్
కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్స్
వెల్లుల్లి రెమ్మలు – 2
చింతపండు – కొద్దిగా
ఉప్పు – తగినంత
కొత్తిమీర – కొద్దిగా
ENO( బేకింగ్ సోడా) – 1 స్పూన్
తయారీ విధానం
1. ఒక మిక్సింగ్ బౌల్ లోకి ,ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుని, రెండు సార్లు శుభ్రంగా కడగాలి.
2. గోధుమ రవ్వలో పెరుగు , 1 కప్పు నీళ్లు, కలుపుకుని, మూత పెట్టి పది నిముషాల పక్కన పెట్టండి
3. ఇప్పుడు చెట్నీ కోసం మిక్సీ జార్ లో పుట్నాలు , పచ్చిమిర్చి, కొబ్బరి పొడి, అల్లం, చింతపండు, వెల్లుల్లి రెమ్మలు, రుచికి సరిపడా ఉప్పు,కొద్దిగా కోతిమీర , తగినన్ని నీరు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.
4. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కి తాళింపు వేసుకుంటే పల్చటి పుట్నాల చెట్నీ రెడీ.
5. ఇప్పుడు దోశపిండి తయారీ కోసం ముందుగా నాన బెట్టుకున్న గోధుమ రవ్వ మిశ్రమాన్ని, మిక్సీ జార్ లో వేసుకుని, గ్రైండ్ చేసుకోవాలి.
6. దోశ బ్యాటర్ కు కొద్దిగా ఈనో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి.
7. స్టవ్ పై పెనం పెట్టుకుని, బాగా వెడెక్కనివ్వాలి.
8. వేడెక్కిన పెనం పై గరిటెడు దోశ బ్యాటర్ వేసి, కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి.
9. చుట్టూ ఆయిల్ చల్లుకుని, ఒక వైపు వేగాక , మరోవైపుకు తిప్పుకోవాలి.
10. అంతే ఇన్ స్టెంట్ గోధమరవ్వ దోశ విత్ పుట్నాల చెట్నీ రెడీ.