Kakarakaya Karam Podi :కాకరకాయ తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారు కాకరకాయ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. కాకరకాయ తినడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.దీన్ని తినడం వల్ల ఫైబర్ అధికంగా శరీరంలో చేరుతుంది. కాకరకాయతో పొడి తయారుచేసుకొని ప్రతి రోజు తీసుకుంటే మంచిది.
కావలసిన పదార్ధాలు
కాకరకాయలు - నాలుగు
చింతపండు - నిమ్మకాయంత
వెల్లుల్లి రెబ్బలు - ఐదు
ఎండుమిర్చి - పది
మినప్పప్పు - ఒక స్పూను
ధనియాలు - అర స్పూను
శనగపప్పు - ఒక స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - రెండు స్పూన్లు
తయారి విధానం
కాకరకాయలను శుభ్రంగా కడిగి తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గంట ఎండలో ఆరబెట్టాలి. ఈ ముక్కలను మూకుడులో వేసి సన్నని మంట మీద వేగించాలి. ఇవి పొడిగా అయ్యేవరకు వేగించాలి. ఆ తర్వాత అదే మూకుడులో ఒక స్పూన్ నూనె వేసి కాగాక మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, చింతపండు, ధనియాలు కూడా వేసి బాగా వేయించాలి.
వీటిని మిక్సీ జార్ లో వేసి మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత వేగించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి మరొక సారి మిక్సీ చేయాలి. అంతే కాకరకాయ కారం పొడి సిద్దం. ఈ పొడి దాదాపుగా 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది.
మధ్యాహ్నం భోజనం, రాత్రి ఆహారంలో ఈ కాకరకాయ పొడితో రెండు ముద్దలు తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.