Bombay Chutney: పూరీతో బొంబాయి చట్నీ సూపర్ కాంబినేషన్..5 నిమిషాల్లో చేసేయవచ్చు

Bombay Chutney: పూర్వ కాలం నాటి వంటకం అయినా బొంబాయి చట్నీ రుచి చాలా బాగుంటుంది. ఒక్కసారి రుచి చూస్తే అసలు వదిలిపెట్టరు. ఇడ్లీ, పూరీతో ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఈ చెట్నీ తయారుచేయటం చాలా సులువు. చాలా తక్కువ సమయంలో చేయవచ్చు. Bombay Chutney కి కావలసిన పదార్ధాలు, తయారి విధానం చూద్దాం.

కావాల్సిన పదార్థాలు
శనగపిండి - అరకప్పు
ఉల్లిపాయ - ఒకటి (ముక్కలుగా కట్ చేయాలి )
పచ్చి మిర్చి - రెండు (ముక్కలుగా కట్ చేయాలి)
జీలకర్ర - అర స్పూను
ఆవాలు - అర స్పూను
కరివేపాకు - గుప్పెడు
పసుపు - పావు టీస్పూను
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
శనగపప్పు - అర స్పూను
మినపప్పు - అర స్పూను
నూనె - ఒక స్పూను
ఉప్పు - రుచికి తగినంత

తయారి విధానం
ఒక గిన్నెలో శనగపిండి,పసుపు వేసి దానిలో నీటిని పోసి ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి వేగించాలి.

ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు,కరివేపాకు వేసి వేగించాలి. ఆ తర్వాత నీటిని కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమం వేసి గరిటెతో బాగా కలపాలి. సరిపడా ఉప్పు వేసి అపకుండా కలుపుతూ ఉండాలి. లేకపోతే ఉండలు కడుతుంది. కాబట్టి దించే వరకు కలుపుతూ ఉండాలి.

ఈ చెట్నీ మరీ పలుచగా కాకుండా చిక్కగా కాకుండా మధ్యస్థంగా ఉండాలి. కొంత మంది పులుపు కోసం చింతపండు లేదా టమోటా కూడా వేసుకుంటారు. చివరగా కొత్తిమీర వేసి బాగా కలపాలి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top