Kobbari Pachadi: కొబ్బరి చెట్నీ చేస్తే, ఇడ్లీ, దోశ, చపాతి, రైస్, అన్నిట్లో తినేచ్చు. అలాంటి ఆల్ ఇన్ వన్ కొబ్బరి చెట్నీని,కాస్త వెరైటీగా చేసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
కొబ్బరి – అరముక్క
ఆయిల్ – 1 టేబుల్ స్పూన్
ఆవాలు - ½ టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
మినపప్పు – 2 టెబుల్ స్పూన్లు
శనగపప్పు - 2 టెబుల్ స్పూన్లు
ఎండుమిర్చి -6
పచ్చిమిర్చి – 6
కొత్తిమీర - కొద్దిగా
కరివేపాకు – ఒక రెమ్మ
టమాటాలు – 5
చింతపండు - కొద్దిగా
తయారీ విధానం
1.ముందగా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. స్టవ్ పై పాన్ పెట్టుకుని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని, వేడెక్కిన ఆయిల్లో, జీలకర్ర ,ఆవాలు,
మినపప్పు, శనగపప్పు, దోరగా వేయించుకోండి.
3. అందులోకి పచ్చిమిర్చి,ఎండుమిర్చి యాడ్ చేసుకుని, కొద్దిగా ఫ్రై చేయండి
4. బాగా వేగాక, కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకుని ,కొద్దిగా చింతపండు కలుపుకోండి.
5. ఒక నిముషం పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేయండి
6.చల్లారిన కొబ్బరి ముక్కలను మిక్సీ జార్ లోకి తీసుకోండి.
7.ఇప్పుడు ఇదే పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుని, కొత్తిమీర, కరివేపాకు, టమాటా ముక్కలు వేసుకుని, చల్లారిన తర్వాత, కొబ్బరి ముక్కలతో పాటుగా మిక్సీ జార్లోకి వేసుకుని, తగినింత ఉప్పు కలుపుకుని గ్రైండ్ చేసుకోండి.
8. కొద్దిగా నీరు పోసుకుని బరకగా ఉండేలా మరోసారి తిప్పండి.
9. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ లోకి తాలింపు వేసుకుంటే కొబ్బరి చెట్నీ రెడీ