Green Chilli Health Benefits: పచ్చి మిర్చిను పక్కన పెడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి

Green Chilli Health benefits:మిరపకాయ తింటే ఘాటు....తినకుంటే చేటు అన్నది పరిశోదకుల మాట. దీని ఘటును తలచుకుంటే కొందరికి కళ్ళలోంచి నీరు కారితే,కొందరికి నోట్లో నీళ్ళురతాయి. ఎక్కువో,తక్కువో మిరపకాయ ఘాటు లేకుండా ఆహార పదార్దాలు తయారుచేయటం దాదాపు అసాధ్యం. 

అయితే ప్రస్తుత కాలంలో మిరపకాయ ఘాటు ఆరోగ్యానికి హాని చేస్తుందని చాలా మంది దీని వాడకాన్ని తగ్గించారు. ఇది హానికరం అనేది ఒక అపోహ మాత్రమే. దీనిలో అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయి.

గుండె జబ్బులు
మిరపకాయలను ఆహారంలో తీసుకోవటం వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీర సామర్ధ్యం పెరిగి రక్తంలో గడ్డలు కరిగిపోతాయి. గుండె జబ్బులకు కారణమైన కడుపులో మంటను అరికట్టటానికి మిరపకాయలో కాప్సైసిన్ ఉంటుంది. అందుకే మిరపకాయలను ఎక్కువగా ఉపయోగించేవారు గుండె జబ్బులకు దూరంగా ఉంటారు.

రక్త ప్రసరణ
ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచి రక్తపోటు అదుపులో ఉంచటానికి సహాయపడుతుంది. మసాలాలు,ఘాటైన ఆహార పదార్దాలు తీసుకున్నప్పుడు రక్త ప్రసరణ వేగవంతం అవుతుంది. తద్వారా గుండెకు రక్త సరఫరా కూడా ఎక్కువ అవుతుంది. దీనిలో ఉండే విటమిన్ ఎ,సి లు రక్త నాళాలను దృడంగా ఉంచుతాయి.

జీర్ణ శక్తి పెరగటానికి
మిరపకాయలు జీర్ణ శక్తి పెరగటానికి సహకరిస్తాయి. ఇవి కడుపులో హైడ్రో క్లోరిక్ స్కేరిటన్ ను పెంచుతాయి. ఇవి ఉదరానికి రక్త ప్రసరణను పెంచటానికి దోహదం చేస్తాయి. దీనిలో ఉండే కాప్సైసిన్ ఉదర భాగంలో ఏర్పడే బ్యాక్టీరియను నాశనం చేస్తుంది. కొందరికి కొంత మొత్తంలో మిరపకాయలు లేదా మసాలాలు తిన్నా గుండెలో మంట అన్పిస్తుంది. అలాంటి వారు మాత్రం యంటాసిడ్ టేబ్లేట్స్ వాడాలి.

మానసిక పరిస్థితి మెరుగుదల
మిరపకాయలో ఎండార్ఫిన్,సేరోటినిన్ హార్మోన్స్ పెంచటానికి దోహదం చేస్తాయి. పై రెండు హార్మోన్స్ మూడ్ ను మార్చి మానసికంగా ఆనందంగా ఉంచటానికి దోహదం చేస్తాయి. అలాగే ఒత్తిడి,ఆందోళన వంటి సమస్యలకు సమర్దవంతముగా పనిచేస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top