Instant Badam Milk Powder: ఎప్పుడు నోటికి ఇష్టమైన ఫుడ్డే కాదు. అపుడప్పుడూ ఆరోగ్యానికి ఉపయోగ పడే ఫుడ్ కూడా తీసుకోవాలి. హెల్తీ అండ్ టేస్టీ, ఇన్ స్టెంట్ బాదాం మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్దాలు
పాలు - తగినన్ని
బాదాం – 1 కప్పు
కాజు - ¼ కప్పు
పిస్తా పప్పు – 1 టేబుల్ స్పూన్
చక్కెర - 1 ½ కప్పు
పసుపు - ½ టీ స్పూన్
కుంకుమ పువ్వు – కొద్దిగా
యాలకులు - 8
తయారి విధానం
1.స్టవ్ పై ఒక పాన్ పెట్టుకుని,అందులోకి బాదాం పప్పు, పిస్తా, జీడిపప్పులు వేసి,
దోరగా వేయించుకోండి.
2. ఇప్పుడు పప్పులు చల్లారక, అందులో కొన్ని పప్పులు తీసుకుని, సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి.
3. మిగిలిన పప్పులన్ని మిక్సీ జార్ లో వేసుకుని, అందులో యాలకుడి పొడి వేసుకుని, గ్రైండ్ చేసుకోండి.
4.ఆ పౌడర్ తీసి పక్కనపెట్టుకుని, అదే మిక్సీ జార్ లో చక్కెర, పసుపు యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
5. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్, చక్కెర పౌడర్ , ఒక గిన్నెలో వేసి మిక్స్ చేసుకోవాలి.
6. అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తురుము, కొద్దిగా కుంకుమ పువ్వు యాడ్ చేసుకుని కలుపుకోవాలి.
7. బాగా కలుపుకున్న ఈ ఇన్ స్టెంట్ బాదాం మిల్క్ పొడర్ ను, ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి.
8. బాదం పాలు, చేయాలి అనుకున్నప్పుడు, చిక్కని పాలు వేడి చేసుకుని, అందులో తయారు చేసుకున్న బాదం పౌడర్ వేసుకుంటే ఇన్ స్టెంట్ బాదాం మిల్క్ రెడీ
9.సమారుగా అర లీటర్ పాలకు నాలుగు స్పూన్ల్ బాదాం పౌడర్ కలుపుకుంటే, పర్ఫెక్ట్ బాదాం మిల్క్ రెడీ