Catering Style Beerakaya Tomato Pachadi: క్యాట‌రింగ్ స్టైల్‌లో బీర‌కాయ‌, ట‌మాటా ప‌చ్చ‌డిని ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Catering Style Beerakaya Tomato Pachadi: వేడి వేడి అన్నంలోకి, కమ్మటి రోటి పచ్చళ్లు ఉంటే, కూరల అవసరం లేదనిపిస్తుంది. చాలా ఈజీగా, తొందరగా చేసుకునే, కమ్మటి బీరకాయ టామాటా పచ్చడి, ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం.

కావాల్సిన పదార్దాలు
బీరకాయలు – 350 గ్రాములు
టమాటాలు – 3
పచ్చి శనగపప్పు – 1 టేబుల్ స్పూన్
మినపప్పు -1 టేబుల్ స్పూన్
ఆయిల్ -2 టేబుల్ స్పూన్
ధనియాలు – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర- 1/2టీ స్పూన్
పల్లీలు - 1 టేబుల్ స్పూన్
నవ్వులు – 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి – 10
పసుపు - 1/2టీ స్పూన్
చింతపండు – కొద్దిగా
ఉప్పు – తగినంత
తాళింపు గింజలు – 1 టీ స్పూన్
ఇంగువ – చిటికెడు
వెల్లుల్లి రెమ్మలు – 4
కరివేపాకు – 1 రెమ్మ
ఎండుమిర్చి -2

తయారీ విధానం
1. బీరకాయ తొక్కు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోండి.

2. టమాటాలు కూడా చిన్న ముక్కులుగా కట్ చేసుకుని, పక్కన పెట్టుకోండి.

3. స్టవ్ పై బాండీ పెట్టుకుని, టూ టేబుల్ స్పూన్స్, ఆయిల్ వేసి, అందులో పచ్చిశనగపప్పు, మినపప్పు, వేసి

దోరగా వేయించండి

4. అందులోకి జీలకర్ర,ధనియాలు, పల్లీలు మరోసారి లో ఫ్లేమ్ లో వేయించుకోండి.

5.మాడకుండా వేపుతో, అందులోకి నువ్వు కూడా యాడ్ చేసుకోండి.

6. అందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి కలిపి కలుపుకోవాలి.

7.పచ్చిమిర్చి వేగాక బీరకాయ ముక్కలు వేసుకుని, రెండు మూడు నిముషాల తర్వాత , కొంచం ఉప్పు, పసుపు, యాడ్ చేసుకుని, బాగా కలుపుకోండి.

8. ఒక నిముషం తర్వాత, కట్ చేసుకున్న టమాట ముక్కలు, చింతపండు వేసి, కలుపుకోండి.

9. ఇప్పుడు పాన్ పై మూత పెట్టుకుని, టమాటలు మెత్తగా అయ్యేవరకు మగ్గనివ్వండి.

10.స్టవ్ హాఫ్ చేసుకుని మిశ్రమాన్ని చల్లారనివ్వండి.

11. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసుకుని, గ్రైండ్ చేసుకోండి.

12. ఇప్పుడు తాళింపు కోసం పాన్ పెట్టుకుని 2 టేబుల్ ఆయిల్ వేసి, వేడెక్కిన తర్వాత ,అందులో పోపు దినుసులు, నాలుగు వెల్లుల్లి రెమ్మలు, చిటికెడు ఇంగువ, ఒక రెమ్మ కరివేపాకు, రెండు ఎండు మిరపకాయలు తుంచుకుని వేసుకోండి.

13. స్టవ్ ఆఫ్ చేసుకుని వేగిన పోపును పచ్చళ్లో కలిపేసుకోండి.

14. అంతే కమ్మటి బీరకాయ టమాట పచ్చడి రెడీ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top