Dondakaya Pachi Karam Fry:పప్పు , కూర , చారు, కూరలు ఏవైనా తోడుగా, కొద్దిగా ఫ్రై కర్రీస్ ఉంటే, భోజనం సంపూర్ణం అనిపిస్తుంది. ఆ ఫ్రై కూడా ఒకేలా కాకుండా, డిఫరెంట్గా చేస్తేనే తినాలనిపిస్తుంది. మరి కొత్తగా పచ్చికారం దొండకాయ ఫ్రై చేద్దామా
కావాల్సిన పదార్దాలు
దొండకాయలు - 500 గ్రాములు
నూనె – 2 టేబుల్ స్పూన్స్
తాళింపు గింజలు – 1 టీ స్పూన్
కరివేపాకు – ఒక రెమ్మ
ఉప్పు – తగినంత
పచ్చిమిర్చి -8
వెల్లుల్లి రెబ్బలు -10
జీలకర్ర- 1 టీ స్పూన్
పసుపు - 1/2టీ స్పూన్
ఎండుకొబ్బరి పొడి - 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం
1. ముందుగా లేత దొండకాయలు అరకేజీ తీసుకుని,శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
2. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకుని, ఆయిల్ వేసుకుని, వేడెక్కిన తర్వాత తాళింపు గింజలు వేసుకోవాసి.
3.పోపు దినుసులు వేగిన తర్వాత కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి,
మీడియం ఫ్లేమ్ లో రెండు మూడు నిముషాలు కలుపుతూ ఉండాలి.
4. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని, మరో రెండు నిముషాలు వేగనివ్వండి.
5. ఇప్పుడు బాండీ పై మూత పెట్టి, బాగా మగ్గేవరకు, కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
6.మరో వైపు ఒక మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి.
7.ఇప్పుడు దొండకాయ ముక్కలు మరోసారి కలుపుతూ , కొంచం పసుపు యాడ్ చేసి, మిక్స్ చేసి మూత పెట్టుకోండి.
8.ఇప్పుడు వేగిన దొండకాయాల్లోకి, గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుని, రెండు మూడు నిముషాలు, వేయించుకోండి.
9. ఇఫ్పుడు చివరగా ఎండుకొబ్బరి యాడ్ చేసి, బాగా కలుపుకుంటే పచ్చికారం దొండకాయ ఫ్రై రెడీ.