Chekkara pongali : చక్కెర పొ౦గలి అంటే మనలో చాలా మందికి ఇష్టం. అయితే మనం గుడికి వెళ్ళినప్పుడు పెట్టె చక్కెర పొ౦గలి ప్రసాదం చాలా రుచిగా ఉంటుంది. అదే రుచితో చక్కెర పొ౦గలి ఎలా చేసుకోవాలో చూద్దాం.
కావాల్సిన పదార్దాలు
పెసర పప్పు - ఒక కప్పు
బియ్య౦ - ఒక కప్పు
నెయ్యి - ఒక కప్పు
నీళ్ళు - 5 కప్పులు
కు౦కుమ పువ్వు - చిటెకడు
జీడిపప్పులు - 15
యాలకులు - 6
ప౦చదార - 2 కప్పులు
తయారుచేసే విధానం
ఒక చిన్న కుక్కర్ ను పొయ్యి మీద పెట్టి నెయ్యి వేసి కాగాక జీడిపప్పు వేసి వేగించి పక్కన పెట్టాలి. అదే కుక్కర్ లో మిగిలిన నెయ్యిలో బియ్యం,పెసరపప్పు వేసి కొంచెం దోరగా వేగించాలి. వేగిన తర్వాత నీరు పోసి కలపాలి. ఒక ఉడుకు రాగానే అందులో యాలకుల పొడి,పాలల్లో నానబెట్టిన కు౦కుమ పువ్వు వేసి కలిపి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చాక పొయ్యి కట్టేయాలి.
పది నిముషాలు అయిన తర్వాత కుక్కర్ మూత తీసి అందులో పంచదార వేసి బాగా కలిపి ఒక 5 నిముషాలు పొయ్యి మీద సిమ్ లో ఉంచి దించేయాలి. ఇప్పుడు పైన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి చక్కెర పొ౦గలి రెడీ అవుతుంది.