
మొటిమలు ఉన్నప్పుడు ముఖం శుభ్రం చేసుకొనే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖాన్ని శుభ్రం చేయటానికి సబ్బులు కన్నా నీటిని ఎక్కువగా ఉపయోగించటం మంచిది.
రోజు మొత్తంలో వీలైనన్ని ఎక్కువ సార్లు జిడ్డు పోయే విధంగా ముఖాన్ని కడగాలి. గాడమైన రసాయనాలు ఉపయోగించి తయారుచేసిన సబ్బులు,ఫేస్ వాష్ లును అసలు ఉపయోగించకూడదు.
నూనె రహిత మేకప్ సామాను మాత్రమే ఉపయోగించాలి. అలాగే మొటిమలు ఉన్నవారు నేరుగా ఎండలోకి వెళ్ళకూడదు. ఎండలోకి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా గొడుగు వెంట తీసుకువెళ్ళాలి.
ఒక స్పూన్ టమోటా గుజ్జులో ఒక స్పూన్ పాలు,రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖానికి బాగా పట్టించి ఆరాక శుభ్రం చేసుకోవాలి.
రాత్రి పడుకొనే ముందు మొటిమల మీద టూట్ పేస్ట్ అప్లై చేసి,తెల్లవారి లేచిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా మొటిమలు తగ్గే వరకు చేయాలి.
మెంతి ఆకులను మెత్తగా రుబ్బి మొటిమల మీద ఆపాలి చేసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
ఫేస్ పౌడర్,పాలు,పసుపు సమపాలలో తీసుకోని పేస్ట్ చేసి మొటిమల మీద అప్లై చేసి బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఒక కప్పు నీటిలో గుప్పెడు తులసి ఆకులను వేసి బాగా మరిగించి అనంతరం ఆ నీటిని వడకట్టి చల్లార్చి ఆ నీటిని దూదితో మొటిమలు ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి.
మొటిమలు ఉన్న ప్రాంతంలో లేవండర్ ఆయిల్ ను అప్లై చేసి బాగా ఆరాక శుభ్రం చేసుకోవాలి.