Why Feel Sleepy After Breakfast : బ్రేక్‌ఫాస్ట్ తర్వాత నిద్ర ఎందుకు వస్తుంది? ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకున్న తర్వాత నిద్ర రావటానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. తీసుకున్న ఆహారం నిదానంగా జీర్ణం అవ్వటం,నీరసంగా ఉండటం.శారీరక శ్రమ లేకపోవటం వంటివి కారణాలుగా ఉంటాయి.
శారీరక శ్రమ లేకపోవటం వలన తీసుకున్న ఆహారం చాలా నిదానంగా జీర్ణం అవుతుంది. దాంతో బద్దకంగా ఉండి నిద్ర వస్తుంది. శారీరక పనితీరు మీద ప్రభావం పడుతుంది. జీర్ణక్రియ బాగా జరగటానికి బ్రేక్ ఫాస్ట్ లో పైబర్ ఉన్న ఆహారాలను చేర్చాలి.
తాజా పండ్లు మరియు జ్యూస్ లతో ఉదయాన్ని ప్రారంభించాలి. బ్రేక్ ఫాస్ట్ లో నూనె, పిండితో చేసిన వాటిని తినకూడదు. జీర్ణక్రియ సరిగ్గా జరిగితే నిద్ర సమస్య ఆటోమేటిక్‌గా దూరమవుతుంది.
బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం అయినా, తిన్న తర్వాత కొంచెం సేపు నడవటం మంచిది. ఉదయం సమయంలో ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రొటీన్లతో పాటు కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే.. శరీరంలో సెరోటోనిన్ హార్మోన్ స్రావం వేగంగా పెరుగుతుంది.
ఇది శరీరానికి విశ్రాంతినిస్తుంది. దీని కారణంగా నిద్రపోతున్నట్లు అనిపిస్తుంది. రాత్రి సమయంలో సరైన నిద్ర లేకపోయినా బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత నిద్ర వస్తుంది. కాబట్టి రోజులో 6 లేదా 7 గంటల పాటు నిద్ర ఉండేలా చూసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow TeluguLifeStyle On Google News