sleeping Tips;రాత్రి ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే ఇవి తినండి?

sleeping Tips
Sleeping Tips:మన ఆరోగ్యం మీద ఆహారం ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో ..అంతే ప్రభావాన్ని నిద్ర కూడా చూపుతుంది. సరైన నిద్ర లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.

నిద్రలేమి మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. సరైన సమయంలో చికిత్స చేయకపోతే, తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. నిపుణుల ప్రకారం మెగ్నీషియం మరియు జింక్ లోపం కారణంగా నిద్రలేమి సమస్య వస్తుంది.

GABA గ్రాహకాలు అనేవి నిద్రను నియంత్రించే మెదడు గ్రాహకాలు. వీటి పనితీరుకు మెగ్నీషియం అవసరం. ఆమ్న శరీరానికి తగినంత మెగ్నీషియం అందకపోతే ఒత్తిడికి గురి అయ్యి నిద్రకు దూరం అవుతాము.

అలాగే న్యూరోట్రాన్స్మిటర్ పనితీరులో జింక్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా ఆరోగ్యకరమైన నిద్రకు మెలటోనిన్ అనేది కీలకమైన హార్మోన్. ఈ హార్మోన్ స్థాయిలు కూడా తగినంత ఉండాలి.

నిద్రలేమి సమస్య నుండి బయట పడాలంటే మెగ్నీషియం సమృద్దిగా లభించే బేరి, గుమ్మడి, అరటిపండు బ్రౌన్ రైస్, కిడ్నీ బీన్స్, అవకాడో, కొవ్వు చేపలు, ఓట్స్ , బాదం వంటి ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. మీరు నిద్రపోయే ముందు ఫోన్, ల్యాప్‌టాప్ లేదా డిజిటల్ పరికరాలకు దూరంగా ఉండాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow TeluguLifeStyle On Google News
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top