vomiting Home remedies: కొందరికి బస్సు పడదు, మరికొందరికి కారు పడదు, ఇంకొందరికి విమానం పడదు. ఎక్కితే చాలు వికారం మొదలై వాంతులు అయిపోతాయి. వాంతులు అవుతున్నప్పుడు నిలకడగా ఒక చోట కూర్చోలేము. అలాగే ప్రశాంతంగా లేక చికాకుగా ఉంటుంది.
దీనికి కలుషిత ఆహారం తీసుకోవటం,తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవటం,నీరు కలుషితం కావటం వంటివి కారణాలుగా చెప్పవచ్చు. వీటి నివారణకు మందులతో పాటు ఇంటి వైద్యం కూడా బాగా పనిచేస్తుంది. ఈ చిట్కా వైద్యాలు పనిచేయకపోతే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.
అల్లం
ఇంటి వైద్యంలో అల్లానిదే ప్రధమ స్థానం. చాలా సమస్యలకు మందుగా పనిచేస్తుంది. వాంతులు అవుతున్నా,వాంతి అనుభూతి ఉన్నా అల్లం టీ చేసుకొని త్రాగండి. వెంటనే గొప్ప ఉపశమనం కలుగుతుంది. లేనిచో అల్లం ముక్కను చిన్న ముక్కగా చేసుకొని నమిలి ఆ రసాన్ని మింగ వచ్చు. వాంతులు అవుతున్నప్పుడే కాకుండా ప్రతి రోజు ఆహార పదార్దాలలో వేసుకుంటే అజీర్ణం సమస్య ఉండదు.
నిమ్మకాయ
వాంతుల నుండి తప్పించుకోవటానికి మరో తేలికైన మార్గం నిమ్మకాయ. ఒక గ్లాస్ చల్లని నీటిలో నిమ్మకాయ పిండి దానికి చిటికెడు ఉప్పు లేదా నల్ల ఉప్పు కలిపి త్రాగాలి. రసం తీసేసిన నిమ్మ చెక్కలను నాకటం ద్వారా కూడా వాంతుల నుండి ఉపశమనం కలుగుతుంది.
సోడా
వాంతుల ఫీలింగ్ నుండి తప్పించుకోవటానికి సోడాను ఉపయోగించవచ్చు. సోడా బాటిల్ మూత తెరిచిన వెంటనే త్రాగకుండా గ్యాస్ పోయేంతవరకు ఆగి త్రాగాలి. అయితే సోడా త్రాగటానికి పేరున్నా మంచి కంపెనీ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాలి.
హెర్బల్ టీ
హెర్బల్ టీలలో ఏది త్రాగినా మంచి పలితాన్ని ఇస్తుంది. గ్రీన్ టీ,లెమన్ టీ ఇలా అనేక రకాల టీలు ఉన్నాయి. వాటిలో మీకు ఇష్టమైన టీ లను ఎంపిక చేసుకోండి.