Weight Loss:మారిన జీవన విధానం,ఆహారపు అలవాట్లే బరువు పెరగటానికి కారణం అని నిపుణులు చెప్పుతున్నారు. అంతేకాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా బరువు పెరగటానికి కారణం అవుతున్నాయి.
ఇంటి పనికి విద్యుత్ పరికరాలు రావటం వలన స్త్రీలకు శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. శరీరంలో చేరిన అధిక కొవ్వును తగ్గించుకోవటం అంత సులువు మాత్రం కాదు. ఆహార అలవాట్లతో పాటు జీవన విధానంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి.
చేయవలసిన పనులు
సాధ్యమైనంతవరకు ఎంత దూరం ఉన్నా నడిచి వెళ్లి పనులు చేసుకోవటం అలవాటు చేసుకోవాలి.
బయట వాకింగ్ చేయలేదని అనుకోనక్కరలేదు. ఎందుకంటే ఇంటిలో మెట్లను పది సార్లు ఎక్కి దిగండి.
జిమ్ కి వెళ్ళే బదులు స్విమ్మింగ్ చేస్తే అంతకన్నా మంచి పలితాన్ని పొందవచ్చు.
ఐస్ క్రిమ్స్ కి బదులు తాజా పండ్ల ముక్కలను కొంతసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి చల్ల చల్లగా తినవచ్చు.
పార్టీలు,పబ్స్ కి వెళ్ళిన రాత్రి పది లోపు ఇంటికి చేరుకోవాలి.
టివికి బదులు గార్డెనింగ్ మరియు కుట్లు,అల్లికలు వంటి వాటిని చేయటం అలవాటు చేసుకోండి.
ఉపవాసాలు చేయవలసి వచ్చినా అన్నానికి బదులు చపాతీ లేదా పళ్ళను తీసుకోండి.
చేయకూడని పనులు
చిన్న చిన్న పనులకు కూడా వాహనాన్ని ఉపయోగించకూడదు.
మెట్లు ఎక్కేటప్పుడు,దిగేటప్పుడు లిఫ్ట్ ఉపయోగించకుండా ఉంటే మంచిది.
వేపుడు పదార్దాలు,మాంసాహారం వంటి వాటిని సాధ్యమైనంత వరకు మానివేయాలి.
నోరూరుంచే ఐస్ క్రీమ్స్,ఫ్రూట్ సలాడ్స్ కి దూరంగా ఉండాలి.
మద్యపానం,ధూమపానం వంటి వాటికీ కూడా దూరంగా ఉండాలి.
టివీలు,కంప్యూటర్,వీడియోల దగ్గర ఎక్కువసేపు ఉండకూడదు.