దురద అనేది నలుగురు మధ్య ఉన్నా సరే ఇబ్బంది పెట్టేస్తుంది. వాహనం మీద ప్రయాణిస్తున్న సరే ఆగి దీని పని పూర్తి చేసుకోవలసిందే. సమయం,సందర్భం లేకుండా బాదించే దురద సమస్యను మందు బిళ్ళలు మింగి నయం చేసుకోవటం కన్నా ఇంటిలోనే కొన్ని పద్దతుల ద్వారా పూర్తిగా దూరం చేసుకోవచ్చు.
సంపూర్ణ స్నానం
బిజీబిజీ జీవితంలో నింపాదిగా సంపూర్ణ స్నానం చేయటం అన్నది అరుదుగా జరుగుతుంది. ఇది కూడా దురద సమస్యకు ఒక కారణం కావచ్చు. దురదతో బాధపడేవారు చన్నీటి స్నానం కన్నా వేడి నిటి స్నానం చేయటం మంచిది. స్నానం చేసే నీటిలో ఒక కప్పు ఓట్ మీల్ వేసి బాగా కలిపిన తర్వాత స్నానం చేయాలి. అదే విధంగా నీటిలో కొద్దిగా వంట సోడా లేదా పాలు కలిపి కూడా స్నానం చేయవచ్చు. పై మూడు పద్దతుల్లో ఏది చేసిన మంచి పలితాన్ని పొందవచ్చు.
మొక్కజొన్న పిండి
చెమట వలన కూడా కొన్ని సందర్భాలలో దురద రావచ్చు. దురద ఉన్న ప్రాంతంలో మొక్కజొన్న పిండి అప్లై చేస్తే చెమటను పిల్చుకొని దురద తగ్గుతుంది.
నిమ్మరసం
దీనిలో ఎసిడిక్ బ్యాక్టీరియాను సమూలంగా నాశనం చేస్తుంది. నిమ్మరసం లేదా నిమ్మచెక్కను దురద ఉన్న ప్రాంతంలో రుద్దటం ద్వారా దీన్ని తేలికగా పోగొట్టచ్చు. ఇది అన్ని రకాల దురదలకు బాగా పనిచేస్తుంది.
వీట్ జర్మ్ ఆయిల్
చర్మ సౌందర్య సాదనాలలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ నూనెతో చర్మాన్ని ప్రతి రోజు మసాజ్ చేసుకుంటే చర్మం పొడిబారకుండా ఉండటంతో పాటు ఆరోగ్య పరంగా ఎటువంటి సమస్యలు రావు.
కలబంద
ఇది అన్ని రకాల చర్మ సమస్యలకు బాగా పనిచేస్తుంది. చర్మం మీద ఇన్ఫెక్షన్,గాయాలు,పొడిబారకుండా ఉండటానికి మందుగా ఉపయోగపడుతుంది. దురద ఉన్న ప్రాంతంలో కలబంద గుజ్జును నేరుగా రాయవచ్చు. వెంటనే చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే దురదను కూడా బాగా తగ్గిస్తుంది.