రక్తపోటు,ఒత్తిడి రెండు వేర్వేరు పదాలైన,ఇవి రెండు కవల పిల్లల వంటివని నిపుణులు చెప్పుతున్నారు. ఎక్కువ ఒత్తిడికి గురిఅయినప్పుదు రక్తపోటు స్థాయి దానింతట అదే వస్తుందని నిపుణులు చెప్పుతున్నారు. ఒత్తిడిని తగ్గించుకోగల్గితే రక్తపోటు దానింతట అదే అదుపులోకి వస్తుంది. అయితే ఒత్తిడిని తగ్గించటానికి కొన్ని సూచనలను పాటించాలి.
సాదారణంగా వారాంతంలో ఎంజాయ్ చేసి తిరిగి సోమవారం ఆఫీస్ కు వెళ్ళే సమయంలో తెగ హైరానా పడిపోతూ ఉంటారు. అలా కాకుండా ముందు రోజే అంటే ఆదివారం నాడే సోమవారం పూర్తి చేయవలసిన పనులను నిర్దారించుకొంటే ఆందోళన,ఒత్తిడి తగ్గుతాయి.
మెడిటేషన్ ఒత్తిడికి మందుగా పనిచేస్తుంది. ఉదయాన్నే కొద్దిసేపు మెడిటేషన్ చేయటం వలన మనస్సు ప్రశాంతముగా ఉంటుంది. శరీరం చురుకుగా పనిచేస్తుంది.
పనిలో ప్రణాళిక అనేది ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇంటా,బయట పనులతో పాటు,ఆర్ధిక విషయాలలో కూడా ఒక ప్రణాళిక వేసుకోవటం అలవాటు చేసుకోవాలి.
జీవన విధానంలో వచ్చే మార్పులు కూడా ఒత్తిడికి కారణం అవుతాయి. ఉదాహరణకు లేట్ నైట్ పార్టీలకు వెళ్ళటం,పబ్ లకు వెళ్ళటం వలన తెల్లవారి పనులు కాకా హడావిడి పడటం వంటివి ఒత్తిడిని పెంచుతాయి. ఇలాంటి సందర్భంలో రక్తపోటు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
అధిక బరువు కూడా ఒత్తిడికి కారణం అవుతుంది. దీని వలన రక్తపోటు పెరిగి గుండె జబ్బులు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు రావచ్చు.
అనవసర భయాల్ని తగ్గించుకోవాలి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోకపోతే తీవ్ర ఒత్తిడికి గురి అవుతారు. అలా కాకుండా ఆత్మ విశ్వాసంతో పని ప్రారంభిస్తే సకాలంలో పని పూర్తి చేస్తారు.