శీతాకాలంలో ఆస్తమాను జయించే మార్గాలు: పాటించాల్సిన జాగ్రత్తలు

Asthma Patients: శీతాకాలంలో ఆస్తమాను జయించే మార్గాలు: పాటించాల్సిన జాగ్రత్తలు..అస్తమా అనేది దీర్ఘకాలంగా ఉండే ఒక సమస్య. 

మన ముక్కులోకి,ఊపిరితిత్తుల్లోకి,శరీరంలోకి సరిపడని సుక్ష్మ పదార్దాలు గాలి ద్వారా లేదా ఆహారం ద్వారా ప్రవేశించినప్పుడు,వాటికీ ప్రతి చర్యగా మన శరీరం స్పందించి వివిధ రకాల రసాయనాలను విడుదల చేసి శ్వాస నాళాల్లో శ్లేష్మ పొర వాపుకు కారణం అవుతాయి. 

దీని వలన శ్వాస నాళాలు కుచించుకొని పోయి ఊపిరి తీసుకోవటం కష్టం అవుతుంది. దగ్గు,ఆయాసం,పిల్లి కూతలు వంటివి వస్తాయి దీనినే అస్తమా లేదా ఉబ్బసం అని అంటారు.
వాతావరణంలో మార్పులు,దుమ్ము,ధూళి,ఘాటైన వాసనలు,పెంపుడు జంతువులు, వాటి వెంట్రుకలు,మస్కిటో కోయల్స్,రకరకాల స్ప్రే లు, పులా మొక్కల నుండి వచ్చే పిప్పొడి రేణువులు, ఐస్ క్రిమ్స్, జన్యు పరమైన కారణాల వలన అస్తమా వస్తుంది.

అయితే కొన్ని జాగ్రత్తలను తీసుకోవటం ద్వారా మంచి ఉపశమనం పొందవచ్చు. దుమ్ము,ధూళి కి దూరంగా ఉండటం,ఐస్ క్రిమ్స్,శీతల పానీయాలకు దూరంగా ఉండటం, పడని పిప్పొడి రేణువులు ఉండే మొక్కలను పెరటి నుంచి తొలగించటం,పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలను తీసుకుంటే చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. 

అస్తమా ఎప్పటికి తగ్గదని అందరూ భావిస్తారు. కానీ జాగ్రత్తలను తీసుకోని డాక్టర్ సలహా ప్రకారం మందులను వేసుకుంటే తప్పకుండా నివారించవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top