కేవలం తాగడానికే కాదు.. ముఖం నిగనిగలాడేందుకు అద్భుతమైన కాఫీ ఫేస్ ప్యాక్!

Coffee FAce PAck: కేవలం తాగడానికే కాదు.. ముఖం నిగనిగలాడేందుకు అద్భుతమైన కాఫీ ఫేస్ ప్యాక్!.. కొంచెం కాఫీ త్రాగితే ఎంత ఆనందంగా ఉంటుందో..!’ కాఫీ ప్రియులు తరచుగా చెప్పే మాట. 

కాఫీ త్రాగటం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుసు. అయితే కాఫీ పొడి/గింజల వలన సొందర్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? నమ్మకం కుదరటం లేదా? అయితే చదవండి మీకే తెలుస్తుంది.

స్క్రబ్ : కాఫీ పొడి చర్మానికి మంచి స్క్రబ్ గా పనిచేస్తుంది. చర్మం పై ఉన్న మృత కణాలను సులభంగా తొలగిస్తుంది. పలితంగా చర్మం మిలమిల మెరుస్తుంది. 
ఏంటి కాఫీ పొడిని ఎలా స్క్రబ్ గా వాడాలా అని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్. స్నానం చేసే సమయంలో కొంచెం కాఫీ పొడిని తీసుకోని రుద్దుకుంటే సరిపోతుంది.

ముడతలు : ప్రతి మహిళ చర్మం ముడతలు పడకుండా ఉండాలని ఆలోచిస్తుంది. దాని కోసం సహజంగా యాంటి ఏజింగ్ క్రీంలను వాడుతూ ఉంటారు. 

అయితే కాఫీ మంచి యాంటి ఏజింగ్ఏజెంట్ గా పనిచేస్తుంది. రెండు కప్పుల కాఫీ గింజలకు ఒక కప్పు నీటిని,కొన్ని చుక్కలటీ ట్రి ఆయిల్ ని కలిపి బ్లెండర్ లో వేసి మెత్తని పేస్ట్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని బ్రష్ సాయంతో ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయుట వలన చర్మం బిగుతుగా మారటమే కాకుండా మృత కణాలు తొలగిపోతాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top