Weight Loss:కొవ్వును తగ్గించే చీజ్?..దీనిలో నిజం ఎంత..!

Cheese Weight Loss: డైట్ ప్లాన్ లో ఉన్నవారు చీజ్ ని ఒక శత్రువుగా చూస్తారు. దీనిని ఆహారంలో
తీసుకుంటే కొవ్వు పెరిగిపోతుందని అందరూ భావిస్తారు. కానీ ఈ అభిప్రాయం చాలా తప్పని నిపుణులు అంటున్నారు. 

చీజ్ ద్వారా లభించే కాల్షియం కొవ్వును తగ్గించటానికి సహాయపడుతుందని అంటున్నారు. వీరు ఈ విషయం మీద కొన్ని నెలలుగా పరిశోదన చేసి ఈ విషయాన్ని తేల్చి చెప్పారు.

ఈ పరిశోదన కోసం ఇరవై మంది స్త్రీ, పురుషులను ఎంపిక చేసి రెండు గ్రూపులుగా విడదీసారు. ఒక గ్రూప్ వారికీ తక్కువ పాల ఉత్పత్తులు మరియు తక్కువ కాల్షియం(చీజ్) ఉన్న ఆహారాన్ని ఇచ్చారు. 

మరొక గ్రూప్ వారికీ ఎక్కువ పాల ఉత్పత్తులు, ఎక్కువ కాల్షియం(చీజ్) ఉన్న ఆహారాన్ని ఇచ్చారు. అనంతరం వారి మలవిసర్జన ద్వారా ఎంత కొవ్వు బయటకు వచ్చింది? అన్న విషయాన్ని పరిశీలన చేసారు. 

తక్కువ కాల్షియం తీసుకున్న వారిలో ఒక వారంలో 56 గ్రాముల కొవ్వు బయటకు రాగా,ఎక్కువ కాల్షియం తీసుకున్న వారిలో 88 గ్రాముల కొవ్వు బయటకు వచ్చినట్టు వీరు గుర్తించారు. 

అందువలన ఎక్కువ కాల్షియం(చీజ్) కలిగిన ఆహారాన్ని తీసుకోవటం వలన మంచి పలితాన్నే
పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే చీజ్ మంచిది అన్నారని మరీ ఎక్కువగా తీసుకోవటం కూడా అంతా మంచిది కాదు. ఏదైనా సరే మితంగా తీసుకుంటేనే మంచిది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top