Manicure At Home:ఇంట్లోనే మానిక్యూర్ చేసుకోండిలా.. ఇవే సింపుల్ స్టెప్స్..

Manicure At Home:చేతులను అందంగా ఉంచుకోవటానికి మేనిక్యుర్ ఒక సులభమైన మంచి పద్దతి. వారంలో ఒకసారి చేతులకు మేనిక్యుర్ చేయాలి. మీరు ఇంటిలో మేనిక్యుర్ చేసుకోవటానికి
కేవలం ఐదు నిముషాలు కేటాయిస్తే చాలు. ఇప్పుడు మేనిక్యుర్ ఎలా చేయాలో చూద్దాం.

ఒక బౌల్ లో గోరువెచ్చని నీటిని తీసుకోని దానిలో కొన్ని చుక్కల షాంపూను వేయండి. అందులో మీ చేతులను 10 నిముషాలు నానబెట్టండి. ఆ తర్వాత చేతుల్ని తీసి టవల్ తో శుభ్రంగా తుడుచుకోండి. కొబ్బరి నూనెతో మృదువుగా మసాజ్చేయండి.

నెయిల్ పాలిష్ రిమూవర్ తో పాత నెయిల్ పెయింట్ ని క్లిన్ చేయండి. నెయిల్ పెయింట్ శుభ్రం చేసుకున్నాక గోళ్ళను ట్రిమ్ చేయండి. గోళ్ళ చివర్లు బయటకు కనపడకుండా ఒక క్రమ పద్దతిలో పైలింగ్ చేయండి. పొడవైన సన్నని వేళ్ళపై పొడవైన గోళ్ళు బాగుంటాయి.

మరల చేతులను గోరువెచ్చని సబ్బు నీటిలో ఉంచండి. తర్వాత టవల్ తో మెల్లగా వేళ్ళను సబ్బు లేకుండా శుభ్రంగా తుడవాలి.

గోళ్ళపై బేస్ కోట్ వేయాలి. సాదారణంగా బేస్ కోట్ అనేది పారదర్సకమైన నేచురల్ రంగులో ఉంటుంది. బేస్ కోట్ వేస్తె గోళ్ళ రంగు సాదారణంగా కనిపించటమే కాకా గోళ్ళు పల్చగా మారవు. వాటిపై నెయిల్ పెయింట్కె మికల్స్ ప్రభావం పడదు.

బేస్ కోట్ ఆరాక మీకు ఇష్టమైన నెయిల్ పెయింట్ వేయండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top